అట్టర్ ఫ్లాప్ కే ఇంత.. మరి హిట్టయుంటే??

అట్టర్ ఫ్లాప్ కే ఇంత.. మరి హిట్టయుంటే??

పీఎస్పీకే25 అంటూ ముందునుంచి విపరీతమైన ప్రచారం జరిగి.. బోలెడన్ని అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి.. అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో.. మొదటి నుంచి హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ వీటిని ఏ మాత్రం రీచ్ కాలేకపోయింది అజ్ఞాతవాసి.

ఈ చిత్రం ఫైనల్ షేర్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం - 10.45 కోట్లు

వైజాగ్ - 5.45 కోట్లు

ఈస్ట్ - 4.25 కోట్లు

వెస్ట్ - 4.75 కోట్లు

కృష్ణా - 3.35 కోట్లు

గుంటూరు - 5.15 కోట్లు

నెల్లూరు - 2.25 కోట్లు

మొత్తం ఆంధ్ర - 25.15 కోట్లు

సీడెడ్ - 5.30 కోట్లు

ఏపీ ప్లస్ నైజాం - 40.9 కోట్లు

యూఎస్ఏ - 7.20 కోట్లు

కర్నాటక - 6.35 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - 1.15 కోట్లు

రెస్టాఫ్ వరల్డ్ - 1.90 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ వసూళ్లు - 57.5 కోట్లు

తొలి రోజు తొలి ఆటకే అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాకి 57.5 కోట్లు కలెక్షన్స్ అంటే సామాన్యమైన విషయం కాదు. అదే హిట్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా సాధ్యం కాని విషయం. ఈ చిత్రాన్ని అమ్మిన 125 కోట్ల మార్క్ ను అందుకోవడం.. అజ్ఞాతవాసికి పెద్ద కష్టమేమీ కాదనే సంగతి అర్ధం చేసుకోవచ్చు. కానీ కేవలం 46 శాతం రికవరీతో బాంబే వెల్వెట్.. స్పైడర్ ల తర్వాత దేశంలోనే మూడో అతి పెద్ద డిజాస్టర్ గా రికార్డును అజ్ఞాతవాసి తన ఖాతాలో వేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు