అప్పుడే అంజలి మొదలుపెట్టేసినట్టుందే

అప్పుడే అంజలి మొదలుపెట్టేసినట్టుందే

తమిళ ఇండస్ట్రీలో స్థిరపడ్డ తెలుగు పిల్ల అంజలి. తెలుగులో కూడా మంచి గుర్తింపే తెచ్చుకున్నా... ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా ఉన్నది మాత్రం తమిళంలోనే. మొన్నటి వరకు బొద్దుగుమ్మలా ఉన్న అంజలి ఇప్పుడు సన్నబడ్డ అందాలతో రచ్చ చేస్తోంది.

అంజలికి ఒకప్పుడు సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ పిల్లా రోజురోజుకి బరువెక్కిపోతూ వచ్చింది. కుర్ర హీరోయిన్ల ముందు తేలిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు పక్కన పెట్టేశారు. ఇదిగో ఇప్పుడు వర్కవుట్లు చేసి బాగా బరువు తగ్గి సన్న జాజితీగలా మారి వచ్చింది. చిట్టి పొట్టి బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటోను ట్విట్టర్ లో చూసిన వారు ఆమె అంజలి నా కాదా అని అనుమానం పడుతున్నారట. అంతలా తగ్గిపోయింది అంజలి.

మొన్నటికి మొన్న వచ్చే రోజులు నావే... నా గ్లామర్ చూపిస్తా... అని స్టేట్ మెంట్ ఇచ్చింది.   ఇలా చెప్పిందో లేదో అప్పుడే రచ్చ చేయడం ప్రారంభించేసినట్టుంది. అమ్మడికి ప్రస్తుతం తెలుగులో అయితే సినిమాలు లేవు. ఈ ఫోటోలు చూశాకైనా దర్శకులు ఆమె వైపు చూస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English