డేరింగ్ లేడీని గిల్లితే అంతే మరి

డేరింగ్ లేడీని గిల్లితే అంతే మరి

సినిమా పరిశ్రమలో ఉన్న మహిళలపై చిన్నచూపు అనే పాయింట్  ఎంతో కాలంగా చర్చనీయాంశమే. రీసెంట్ గా చెన్నై నడిబొడ్డున అమలాపాల్ కు ఎదురైన వేధింపులు ఇలాంటి కోవకు చెందినవే. ఇలాంటివే చాలానే జరుగుతూనే ఉన్నా.. వాటిలో బయటకు వచ్చేవి కొన్నే అనే సంగతి బహిరంగ రహస్యమే.

అయితే.. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే.. ఆ వేధింపులకు గురి అయిన వ్యక్తి. అమలాపాల్ ను డేరింగ్ లేడీ అనాల్సిందే. తన పెళ్లి పెటాకులు అయిపోయిన పరిస్థితి నుంచి ఈమె బయటకు వచ్చిన తీరు అధ్భుతం అనాల్సిందే. అనతి కాలంలోనే తనకంటూ మళ్లీ ఇండస్ట్రీలో స్థానాన్ని సంపాదించేసుకుంది. అలాంటి అమలాపాల్.. తనతో అలగేశన్ అనే వ్యక్తి ఎలా ప్రవర్తించాడనే విషయాన్ని పూసగుచ్చినట్లుగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. తాను మలేషియా ఈవెంట్ కోసం మరికొందరి కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఈవెంట్ గురించి మాట్లాడానని బయటకు పిలిచాడని చెప్పింది అమల.

ఆ రాత్రి తనతో గడపాలని కోరాడని.. సెక్సువల్ గా ఫేవర్ చేయాలని అన్నాడని చెప్పిన అమల.. తాను వ్యతిరేకించడంతో సెక్స్ రాకెట్ లో ఇరికిస్తానని బెదిరించినట్లుగా తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులకు అమలాపాల్ ఫిర్యాదు చేయడమే హైలైట్. ఇప్పుడు అళగేశన్ తో పాటు మరో ఇద్దరు కూడా ఊచలు లెక్కపెడుతున్నారు. వారి వివరాలను కూడా పబ్లిక్ కి తెలియచేయాలని అంటోంది అమలాపాల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English