ఆ రెండూ అబద్దమే అంటున్న నానీ

ఆ రెండూ అబద్దమే అంటున్న నానీ

సాధారణంగా సినిమా హీరోల మీద రూమర్స్ వస్తూనే ఉంటాయి. వారి కొత్త ప్రాజెక్టుల విషయంలో బోలెడన్ని గాసిప్స్ వస్తుంటాయి. ఆ డైరెక్టర్ తో సినిమా.. ఈ హీరోయిన్ తో మూవీ.. ఫలానా ప్రొడ్యూసర్ తో ప్రాజెక్టు లాంటి కబుర్లు చాలానే ఉంటాయి. వీటిపై అంత త్వరగా హీరోలు స్పందించడం కద్దు.

కానీ నాని మాత్రం తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ఇలా రూమర్స్ వస్తున్నాయో లేదో వెంటనే రియాక్ట్ అయిపోతున్నాడు. న్యాచురల్ స్టార్ కొత్త సినిమాలు అంటూ ఓ రెండు ప్రాజెక్టుల గురించి వార్తలు వచ్చాయి. ఛలో మూవీతో సక్సెస్ సాధించిన దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేసేందుకు నాని ఉత్సాహంగా ఉన్నాడని.. స్టోరీ ఉంటే చెప్పమని ఆఫర్ ఇచ్చాడని టాక్ వచ్చింది. అంతే కాదు.. ఫిదా మూవీతో తనలోని వైవిధ్యతను నిరూపించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ రెండింటి మీదా ఏకకాలంలో రియాక్ట్ అయిపోయాడు నాని.

ఈ రెండు వార్తలు అబద్ధమే అంటూ సోషల్ మీడియా సాక్షిగా చెప్పేశాడు. ఇలా వెంటనే చెప్పేయడం ద్వారా మరిన్ని ఉచిత వార్తలను.. సముచిత ప్రచారాన్ని వదిలేసుకున్నాడు నాని. చెప్పిన విషయం సందర్భోచితంగా ఉన్నా.. రూమర్స్ ఖండించడం విషయంలో నాని తెగ స్పీడ్ చూపిస్తున్నాడు. కాసింత ఆలస్యమైనా చేస్తే.. మరికాసిన్ని గాసిప్పులు పుట్టేవిగా నానీ.. అర్ధం చేసుకోవూ!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English