ఈ పిల్ల అ!శ ఏమవుతుందో!!

ఈ పిల్ల అ!శ ఏమవుతుందో!!

టాలీవుడ్ లో బ్లాక్ అండ్ వైట్ రోజులు పోయిన తరువాత మన ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. ఎక్కువగా పరబాష నటిమణులను ఇష్టపడటం మొదలు పెట్టారు. గత కొంత కాలంగా వారి డామినేషన్ చాలా ఎక్కువైపోయిందనే చెప్పాలి. ఎందుకంటే గ్లామర్ టెస్ట్ ని ఇక్కడ స్ట్రాంగ్ గా తగిలించి వెళ్లడంతో మన ప్రేక్షకులకు బాగా అలవాటైపోయింది. దీంతో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇద్దామంటే గ్లామర్ అడ్డు చెబుతోంది.

ఘాటుగా కనిపించాలంటే వారికి కొంచెం కష్టమే. పోనీ కనిపించాలి అని రెడీ అయినా మనవాళ్లు ఎంతవరకు  యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. దీంతో టెక్నీషియన్స్ కూడా అదే తరహాలో ఆలోచిస్తూ ఆడియెన్స్ ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల  ఒక తెలుగుపిల్ల చాందిని చౌదరి 'హౌరా బ్రిడ్జ్' అంటూ వచ్చి ఫ్లాపునే చవిచూసింది. మొదట బాగానే ఉంటుంది అనుకున్నా మొదటి రోజు తప్ప మళ్లీ సినిమా పేరు వినిపించలేదు. ఇప్పుడు 'అ!' సినిమాతో ఈషా రెబ్బ వస్తోంది. ఏమవుతుందో? అనే అనుమానం కలుగుతోంది.

మనోళ్ళకి మలాయళం కుట్టీలు తమిళ పొన్నులు ముంబయ్ బేబీలు నచ్చినట్లు తెలుగు పిల్లలు మాత్రం నచ్చట్లేదు అనే ముద్ర పడిపోయింది. అయితే ఈషా మాత్రం అ! సినిమా మీద నమ్మకంతో ప్రమోషన్స్ ని బాగానే చేస్తోంది. అందులో నటించిన వారు ఎవరు ఇంకా రెగ్యులర్ ప్రమోషన్స్ లో బిజీ కాలేదు. కానీ ఈషా మాత్రం బిజీ బిజీ అయ్యింది. మరి ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో రెబ్బకు హిట్టు ఇస్తుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English