నాగశౌర్య కొత్త సినిమా ఇదే..

నాగశౌర్య కొత్త సినిమా ఇదే..

సోలో హీరోగా నాగశౌర్య దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘ఛలో’తో పలకరించాడు. ఆ సినిమా అతడికి అదిరిపోయే ఫలితాన్నిచ్చింది. సొంత బేనర్ పెట్టి కొత్త దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో శౌర్య నటించిన ఈ చిత్రం ఈ నెల 2న రిలీజై సూపర్ హిట్ అయింది. అంచనాల్ని మించి వసూళ్లతో నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయింది. ఈ ఉత్సాహంలో తన తర్వాతి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయించాడు శౌర్య.

అమ్మమ్మగారిల్లు.. ఇదీ శౌర్య నటిస్తున్న కొత్త సినిమా పేరు. ‘రిలేషన్స్ నెవర్ ఎండ్’ అనేది క్యాప్షన్. సుందర్ సూర్య అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు దర్శకత్వం వహించాడు. ‘స్వాజిత్ మూవీస్’ బేనర్ మీద రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సీనియర్ నటి సుమిత్ర ఈ చిత్రంలో నాగశౌర్యకు అమ్మమ్మగా నటిస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం సమకూరుస్తున్నాడు.

‘అమ్మమ్మగారిల్లు’లో నాగశౌర్య సరసన షామిలి కథానాయికగా నటిస్తుడటం విశేషం. బాలనటిగా తనదైన ముద్ర వేసిన షామిలి.. ‘ఓయ్’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా ఫ్లాప్ కావడమే కాక షామిలికి లుక్స్, యాక్టింగ్ పరంగా చెడ్డ పేరు తెచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత షామిలి తెలుగులో సినిమా చేస్తోంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి ఫలితాన్నిస్తుంది..? శౌర్య విన్నింగ్ స్ట్రీక్ ఈ సినిమాతోనూ కొనసాగుతుందా..? చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English