ఇంటిలిజెంట్.. రేటింగ్ చూస్తే షాకే

ఇంటిలిజెంట్.. రేటింగ్ చూస్తే షాకే

ఈ ఏడాదే కాదు.. గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్లలో ‘ఇంటిలిజెంట్’ ఒకటి కాబోతోందని తేలిపోయింది. ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. రివ్యూలన్నీ పూర్తి నెగెటివ్‌గానే వచ్చాయి. రేటింగుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక కలెక్షన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఈ సినిమా దాదాపు రూ.28 కోట్లు వెనక్కి తేవాల్సి ఉండగా.. ఫస్ట్ వీకెండ్లో షేర్ మూడున్నర కోట్ల లోపే ఉంది. రాబట్టాల్సిన మొత్తంలో కనీసం 20 శాతం వెనక్కి తేవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. గత కొన్నేళ్లలో కొంచెం రేంజ్ ఉన్న హీరో.. ఓ పెద్ద డైరెక్టర్ కలిసి చేసిన సినిమాల్లో ఈ స్థాయి నెగెటివిటీ మరే సినిమాకూ రాలేదంటే అతిశయోక్తి లేదు.

‘బుక్ మై షో’లో ‘ఇంటిలిజెంట్’కు వచ్చిన రేటింగ్ చూస్తే షాకే. కేవలం 43 రేటింగ్ మాత్రమే ఉంది అక్కడా సినిమాకు. ఎంత చెత్త సినిమా అయినా 50కి అటు ఇటుగా రేటింగ్ తెచ్చుకుంటుంటుంది ‘బుక్ మై షో’లో. గత కొన్నేళ్లలో ఏ తెలుగు సినిమాకూ ఇంత తక్కువ రేటింగ్ రాలేదు. సంక్రాంతికి రిలీజై పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’కి సైతం 57 రేటింగ్ వచ్చింది.

‘బ్రహ్మోత్సవం’ లాంటి మరో మెగా డిజాస్టర్‌కు కూడా జనాలు 49 రేటింగ్ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘తిక్క’కు కూడా 44 రేటింగ్ వచ్చింది. ‘ఇంటిలిజెంట్’ కంటే ముందు వారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘టచ్ చేసి చూడు’కు ‘బుక్ మై షో’లో 63 రేటింగ్ రావడం విశేషం. దీన్ని బట్టి ‘ఇంటిలిజెంట్’ ఏ రేంజిలో జనాలకు అసహనం తెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English