ఇంటర్నెట్ సెన్సేషన్.. తెలివైన పిల్లే

ఇంటర్నెట్ సెన్సేషన్.. తెలివైన పిల్లే

ప్రియ ప్రకాష్ వారియర్.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అమ్మాయి గురించే చర్చ. ‘ఒరు అడార్ లవ్’ అనే సినిమా కోసం తీసిన ఒక పాటలో ఆమె ఇచ్చిన హావభావాలు కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తున్నాయి. ఆ వీడియో కోట్లాది మంది షేర్ చూసుకుంటూ మళ్లీ మళ్లీ చూసుకుంటూ వారెవా అనుకుంటున్నారు.

అందులో ప్రియ హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్లతో ఆమె అభినయించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. యూత్ అంతా ఈ అమ్మాయికి సంబంధించిన ఇతర ఫొటోలు.. వీడియోల గురించి తెగ వెతికేస్తున్నారిప్పుడు.

ప్రియ ప్రకాష్ వారియర్ పేరిట అప్పుడే బోలెడన్ని ఫేక్ అకౌంట్లు కూడా వచ్చేశాయి ట్విట్టర్, ఫేస్ బుక్కుల్లో. ఐతే ఈ క్రేజ్, ఈ ఫాలోయింగ్ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోతున్న ప్రియ.. సైలెంటుగా ఏమీ ఉండిపోలేదు. ఈ ఫేక్ అకౌంట్లకు చరమగీతం పాడేయడానికి తనే రంగంలోకి దిగింది. ఫేస్ బుక్‌లో ఆమెకు ఆల్రెడీ అకౌంట్ ఉండగా.. రెండు రోజుల కిందటే ట్విట్టర్లో అకౌంట్ తెరిచింది.
ఇదే నా ఒరిజినల్ అకౌంట్.. నన్ను ఫాలో అయిపోండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చింది. తన గురించి పొగిడేస్తున్న ట్వీట్లను రీట్వీట్ చేస్తూ.. ఇలా నా మీద ప్రేమను కురిపిస్తూనే ఉండండని కోరింది. అల్లు అర్జున్ లాంటి సెలబ్రెటీలు తన గురించి ప్రస్తావిస్తూ.. ప్రశంసించిన ట్వీట్లను కూడా ఆమె రీట్వీట్ చేసింది. తన వేరే ఫొటోలు.. వీడియోలు కూడా షేర్ చేస్తూ అభిమానుల్ని మరింత అలరించే పనిలో పడింది.

మొత్తానికి అనూహ్యంగా వచ్చిన ఫాలోయింగ్‌ను సరైన దారిలో పెట్టుకుని.. తనరేంజ్ పెంచుకోవడానికి ప్రియ తెలివిగానే వ్యవహరిస్తోంది మరి. రెండ్రోజుల్లోనే ప్రియ ట్విట్టర్ ఫాలోవర్లు 50 వేలకు చేరారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇంతకుముందే అకౌంట్ ఉండగా.. ఇప్పుడు ఆమె ఫాలోవర్ల సంఖ్య 17 లక్షలకు పెరగడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు