మావయ్యలు రంగంలోకి దిగాల్సిందే

మావయ్యలు రంగంలోకి దిగాల్సిందే

ఒకరా ఇద్దరా.. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలో..? చిరంజీవి కానీ.. పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరి మీదో ప్రత్యేక శ్రద్ధ పెట్టే పరిస్థితి లేదు. వాళ్ల కమిట్మెంట్లు వాళ్లవి. అందరినీ వేలు పట్టి నడిపించడం సాధ్యం కాదు. మెగా ఫ్యామిలీ అన్న బ్రాండే వాళ్లకు శ్రీరామరక్ష. ఆ బ్రాండును ఉపయోగించుకుని చాలామంది హీరోలు బాగానే స్థిరపడ్డారు.

అల్లు అర్జున్.. రామ్ చరణ్ పెద్ద రేంజికి వెళ్లిపోయారు. వరుణ్ తేజ్ మధ్యలో కొంచెం తడబడ్డా.. నాగబాబు అండతో, ఇక తర్వాతి తరంలో సాయిధరమ్ తేజ్ బాగానే నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత తేజుకు అండగా నిలవడంతో అతడిపై మెగా మావయ్యలెవ్వరూ పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం రాలేదు.

కానీ దిల్ రాజు చేయి వదిలేసి తేజు సొంత నిర్ణయాలతో చేసిన సినిమాలు వరుసగా తేడా కొట్టేశాయి. అతను ట్రాక్ తప్పాడు. మధ్యలో రాజు వచ్చి ‘జవాన్’తో అతడిని నిలబెడదామని చూసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ‘ఇంటిలిజెంట్’తో పాతాళానికి పడిపోయాడు తేజు. ఫాలోయింగ్ దెబ్బ తిని.. మార్కెట్ పోయి.. తేజు కెరీరే ప్రమాదంలో పడిపోయిందిప్పుడు. ఈ పరిస్థితుల్లో తేజును మెగా ఫ్యామిలీ ఆదుకోవాల్సిందే. చిరంజీవో.. పవన్ కళ్యాణో రంగంలోకి దిగకపోతే కష్టం.

అతడికి సరైన గైడెన్స్ ఇవ్వడం.. సొంతంగా కథలు విని అతడికి సరిపోయేదేదో ఎంపిక చేసి ఇవ్వడం.. మంచి దర్శకుల్ని.. నిర్మాతల్ని సెట్ చేసి ఇవ్వడం.. సినిమా రషెస్ చూసి మార్పులు చేర్పులు చెప్పడం లాంటివి చేయాలి. చిరుకు కథల ఎంపికలో మంచి జడ్జిమెంట్ ఉందన్న పేరుంది. కొడుకు రామ్ చరణ్ కెరీర్‌ను జాగ్రత్తగా నడిపిస్తున్నది ఆయనే. స్వయంగా చిరు రంగంలోకి దిగకపోయినా కనీసం జడ్జిమెంట్ కింగ్ అల్లు అరవింద్‌ చేతికైనా తేజును అప్పగించాలి. లేదంటే కుర్రాడు త్వరలోనే ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English