వరుణ్‌ మారాడు.. ఇప్పుడు అతని వంతు

వరుణ్‌ మారాడు.. ఇప్పుడు అతని వంతు

టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ కోసం పాకులాడే హీరోలు ఎక్కువే. ఎందుకంటే ఒక్కసారి ఈ ఇమేజ్ వచ్చిందంటే.. హీరోగా కుదురుకున్నట్లే అని ఫిక్స్ అయిపోవడమే. వారసులుగా అరంగేట్రం చేసిన వారిలో ఇలాంటి తపన మరీ ఎక్కువగా కనిపిస్తుంది.

గతంలో వరుణ్ తేజ్ కూడా ఇలాగే ట్రై చేశాడు. ముకుంద.. కంచె లాంటి చిత్రాల తర్వాత లోఫర్.. మిస్టర్ అంటూ రెండు ఊర మాస్ మూవీస్ చేశాడు. ఇవి అతనికి హెల్ప్ కాకపోగా.. డ్యామేజ్ కూడా చేశాయి. అప్పుడు ఇప్పటి జనాల టేస్ట్ ను అర్ధం చేసుకున్న వరుణ్ తేజ్.. తన తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటించడం స్టార్ట్ చేశాడు. ఫిదా అంటూ బ్లాక్ బస్టర్ కొట్టి.. ఆ వెంటనే మళ్లీ లవ్ స్టోరీని.. అందులోనూ క్లాస్ మూవీనే ఎంచుకుని.. తొలిప్రేమతో ఇంకో సక్సెస్ ఖాయం చేసుకున్నాడు. వరుణ్ తేజ్ జర్నీ ఇపుడు సూపర్బ్ గా ఉంటే.. అంతకంటే ముందే సుప్రీమ్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సాయిధరం తేజ్ మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడిపోతున్నాడు.

ఇంటెలిజెంట్ మూవీతో వరుసగా ఐదో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న సాయిధరం తేజ్.. ఇంకా మాస్ సినిమాలతోనే కుస్తీలు పడుతున్నాడనే సంగతి అర్ధమవుతుంది. వరుణ్‌ తేజ్ కు వెలిగిన జ్ఞాన బల్బు.. తేజుకు ఇంకా వెలగలేదని అనిపిస్తోంది. వరుస ఫ్లాపుల నుంచి బయటకు రావాలన్నా.. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించాలన్నా.. కచ్చితంగా కొత్తదనం అందించాలని ఎప్పటికి తెలుసుకుంటాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English