యప్ టీవీలో హీరో నిదాహాస్ ట్రోఫీ 2018 ప్రత్యక్ష ప్రసారం

యప్ టీవీలో హీరో నిదాహాస్ ట్రోఫీ 2018 ప్రత్యక్ష ప్రసారం

పాల్గొంటున్న జట్లు- భారతదేశం, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక-టీ 20 క్రికెట్ సీరీస్ యప్ టీవీలో ప్రత్యేకంగా  లైవ్ స్ట్రీమ్ చేయబడతాయి.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12, 2018: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్, భారతదేశం, మరియు శ్రీలంకల మధ్య జరిగే  త్రి దేశాల సీరీస్ హీరో నిదాహస్ ట్రోఫీ 2018 దక్షిణాసియా కంటెంట్ కు ప్రపంచపు ప్రముఖ  ఓటీటీ బ్రాండ్ యప్ టీవీపై ప్రసారం కానుంది. టి 20 మ్యాచ్ లు మార్చి 6 నుంచి మార్చి 18 మధ్య కొలంబోలో జరగనున్నాయి.  యుఎస్ఏ, కెనడా, మధ్య ప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, యునైటెడ్ కింగ్డమ్ , యూరప్ లలో యప్ టీవీలో ప్రత్యేకంగా లభిస్తాయి.

శ్రీలంక దేశం 70వ స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు సందర్భంగా  జరుగుతున్న ట్రై-సీరీస్ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లో భారతదేశం శ్రీలంకతో తలపడనుంది. టోర్నమెంట్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ ని అనుసరిస్తుంది. మూడు జట్లు ఒక దానితో మరొకటి రెండసార్లు చొప్పున ఆడతాయి, గెలిచిన రెండు జట్లు మార్చి 18న జరిగే ఫైనల్స్ లో తలపడతాయి.

యప్ టీవీ సీఈఓ, స్థాపితుడు శ్రీ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ, ' ఇతర ఆటల మాదిరిగా కాకుండా, క్రికెట్ కి అంతర్జాతీయంగా అసంఖ్యాకంగా  ప్రేక్షకులు ఉన్నారు మరియు లోగడ కంటే ఎక్కువ ప్రాచుర్యాన్ని సంపాదించటంలో టి20 క్రికెట్ సహాయపడింది. వివిధ ప్రాంతాల్లో  హీరో నిదాహాస్ ట్రోఫీ 2018 సీరీస్ ప్రసారం చేసే ప్రత్యేక హక్కుల్ని పొందినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాము మరియు యాక్షన్ నిండిన క్రికెట్ ఆటని ఒక్క నిముషం కూడా తప్పిపోకుండా  స్ట్రీమింగ్ చేసే సౌకర్యాన్ని మా ప్రేక్షకులకు ఇవ్వటానికి మేము ఎదురుచూస్తున్నాము. '

కొలంబోలో ఆర్.ప్రేమదాస స్టేడియం నుంచి యాక్షన్ లైవ్ ని క్రికెట్ అభిమానులు www.yupptv.com  పై చూడవచ్చు లేదా తమ స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బ్లూ రే ప్లేయర్స్, స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్స్ , స్మార్ట్ ఫోన్స్ మరియు టాబ్లెట్స్  ద్వారా చూడవచ్చు.

యప్ టీవీ గురించి :
యప్ టీవీ దక్షిణాసియా కంటెంట్ కోసం  ప్రపంచంలో అతి పెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ మరియు ఆన్-డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్. 300 + టీవీ ఛానెల్స్, 5000+ మూవీలు మరియు 100+ టీవీ షోలని 14 భాషల్లో చూపిస్తోంది. మీడియా మరియు వినోద రంగంలో  పెట్టుబడి కోసం  ప్రపంచంలో ప్రముఖ పెట్టుబడి సంస్థ కేకేఆర్ స్థాపించిన పాన్ -ఏషియన్ వేదిక ఎమరాల్డ్  మీడియా నుంచి యప్ టీవీ ఇటీవల నిధులు అందుకుంది. యుఎస్ 50 మిలియన్ డాలర్లకు ఎమరాల్డ్ మీడియా ప్రముఖమైన అల్ప వాటా సంపాదించింది. ఎమరాల్డ్ మీడియాకి పరిశ్రమలో మాజీ దిగ్గజాలు రాజేష్ కామత్ మరియు పాల్ ఏల్లోలు నాయకత్వంవహించగా, పెట్టుబడి మరియు కార్యకలాపాల్లో అనుభవం గల బృందం మద్దతునిస్తోంది. మీడియా, వినోదం మరియు డిజిటల్ మీడియా కంపెనీలకు అభివృద్ధి పెట్టుబడిని కేటాయించటానికి ఈ విధానం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. యప్ టీవీ గతంలో అలబామా యొక్క పోర్చ్ క్రీక్ ఇండియన్ ట్రైబ్ నుంచి తన సీరీస్ ఏ  నిధులు సంపాదించింది.

యప్ టీవీకి తన గ్రంథాలయంలో 25000 గంటల వినోదం కంటెంట్ జాబితా ఉంది. సుమారుగా 2500 గంటల కొత్త ఆన్ డిమాండ్ కంటెంట్ యప్ టీవీ విధానానికి ప్రతీరోజు చేరుతుంది. యప్ టీవీ లైవ్ టీవీ మరియు క్యాచప్ టీవీ టెక్నాలజీని అందిస్తుంది. ఎక్స్ పాట్ మార్కెట్ కోసం ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీస్ యప్ ఫ్లిక్స్ మూవీని కూడా అందిస్తుంది మరియు మూవీ పరిశ్రమ నుంచి ప్రముఖంగా ప్రతిభ కలిగిన వారి సహకారంతో సంప్రదాయంబద్ధం కాని కథని చెప్పటాన్ని ముందుకు తీసుకురావటానికి ఇటీవల యప్ టీవీ ఒరిజనల్స్ ప్రారంభించింది. ఒరిజనల్స్  ప్రత్యేకించి యప్ టీవీ విధానంపై డిజిటల్ ప్రేక్షకుల కోసం ఎపిసోడ్ రూపంలో లభిస్తోంది. యప్ టీవీ ప్రస్తుతం విదేశాల్లో నివసించే భారతీయుల కోసం # 1 ఇంటర్నెట్ పే టీవీ విధానంగా మరియు భారతదేశంలో ప్రీమియం కంటెంట్ లభ్యత నుంచి అతి పెద్ద ఇంటర్నెట్ టీవీ వేదికగా ర్యాంక్ సంపాదించింది. యప్ టీవీ అత్యంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయబడే స్మార్ట్ టీవీ యాప్ మరియు 4.0 యూజర్ రేటింగ్ తో 14.5 మిలియన్ మొబైల్ డౌన్ లోడ్స్ ని కలిగి ఉంది.

మరింత సమాచారం కోసం: https://www.yupptv.com/cricket/hero-nidahas-trophy-2018-t20/live-stream  ని సందర్శించండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు