హీరో హీరోయిన్లకంటే ఈమె ప్రచారం ఎక్కువైందే

హీరో హీరోయిన్లకంటే ఈమె ప్రచారం ఎక్కువైందే

మంచు లక్ష్మి కచ్చితంగా విలక్షణమైన నటి అనే విషయం ఒప్పుకోవాల్సింది. ఉత్తమ విలన్ గా నంది అవార్డును గెలుచుకున్న ఈమె.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ముందే హాలీవుడ్ లో వర్క్ చేసింది. అక్కడ కొన్ని ఫీచర్స్ లో కూడా కనిపించిన మంచు లక్ష్మి.. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ లో మెరుస్తోంది.

బాస్మతి బ్లూస్ అనే చిత్రం ఈ నెల 9న యూఎస్ఏలో రిలీజ్ అయింది. బ్రీ లార్సన్.. స్కాట్ బకులా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో.. కీలక పాత్రలో కనిపిస్తోంది ఈ మంచు లేడీ. ఈ చిత్రం కోసం ఏకంగా యూఎస్ఏ టూర్ కూడా వెళుతోంది మంచు లక్ష్మి. నిజానికి బాస్మతి బ్లూస్ కోసం ఆ  సినిమా హీరో హీరోయిన్లు.. దర్శకుడు కూడా అంతగా ప్రచారం చేసుకోవడం లేదు. లిమిటెడ్ రిలీజ్ తో పాటు.. ఇప్పటికే వీడియో ఆన్ డిమాండ్ లో కూడా ఇచ్చేశారు. అందుకే కాబోలు బాస్మతీ బ్లూస్ కి అంతగా ప్రచారం లేదు. కానీ మంచు లక్ష్మి మాత్రం ఏ కొంచెం కూడా తగ్గడం లేదు. ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లి ఓ సుదీర్ఘమైన పర్యటన చేసి మరీ పబ్లిసిటీ చేసేస్తోంది.

అందుకు సంబంధించిన అప్ డేట్స్ ను తన సోషల్ పేజ్ లో రెగ్యులర్ గా ఇస్తోంది కూడా. తన స్పాన్సరర్ గురించి కూడా చెప్పేస్తూ.. ఎంతటి నిజాయితీపరురాలో చెప్పకనే చెప్పింది మంచు లక్ష్మి. ఏమైనా తనది విభిన్న శైలి అని చాటుతూ మరోసారి తన ప్రత్యేకత చాటుతున్న మంచు లక్ష్మికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English