మనవి 18 కోట్లు సర్దేసుకుందా?

మనవి 18 కోట్లు సర్దేసుకుందా?

దీపికా పదుకొనే మూవీ పద్మావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్బ్ సక్సెస్ సాధించింది. ఓ ఫిమేల్ లీడ్ మూవీ తొలిసారిగా 200 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ను అధిగమించి రికార్డు సృష్టించగా.. ఇప్పటివరకూ దేశంలోనే 240 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా పద్మావత్ నిలిచింది.

రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా ఆదరణ అదిరిపోయింది. వివాదాల కారణంగా వచ్చిన ఫ్రీ పబ్లిసిటీ కలిసొచ్చింది. ఏతావాతా ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో కూడా వసూళ్ల వర్షం కురిసింది. ఇప్పటివరకూ మన దగ్గర ఆమిర్ ఖాన్ మూవీ దంగల్ దే పెద్ద రికార్డ్. ఇప్పుడా సినిమాను దాటేసి ఏకంగా 25 కోట్ల నెట్ వసూళ్లను పద్మావత్ కొల్లగొట్టింది. ఇందులో షేర్ ఓ 18-19 కోట్ల వరకూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా ఇది చాలా పెద్ద మొత్తమే. పద్మావత్ ఇంత పెద్ద సక్సెస్ సాధించడానికి.. మన తెలుగు సినిమాలు కూడా ఓ రకంగా బాగా హెల్ప్ చేశాయని చెప్పవచ్చు.

ఇక్కడ సరైన కంటెంట్ తో సినిమాలు లేకపోవడం పద్మావత్ ను భారీ సక్సెస్ చేసింది. సంక్రాంతికి వచ్చిన అజ్ఞాతవాసి - జైసింహా- రంగుల రాట్నం చిత్రాలు పద్మావత్ వచ్చేనాటికి పెర్ఫామెన్స్ చూపే స్థితిలో లేవు. ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు.. ఇంటెలిజెంట్ వంటి చిత్రాలు బాగా డిజప్పాయింట్ చేశాయి. అన్నీ కలిపి హిందీ సినిమా  తప్ప ఆప్షన్ లేని స్థితికి తెచ్చి.. ఆ సినిమాకు కనక వర్షం కురిసేట్లు చేశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English