ఆ దర్శకుడి స్పీచ్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే

ఆ దర్శకుడి స్పీచ్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే

తండ్రీ కొడుకులు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడం అనే విభిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిన ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు త్రికోఠి. రాజమౌళితో.. అతడి కుటుంబ సభ్యులతో త్రికోఠికి మంచి అనుబంధమే ఉంది. అతను దర్శకుడిగా మారడంలో రాజమౌళి పాత్ర కూడా కీలకం. జక్కన్న మిత్రుడైన సాయి కొర్రపాటి ద్వారా త్రికోఠిని దర్శకుడిగా పరిచయం చేయించాడు రాజమౌళి. ఐతే ‘దిక్కులు చూడకు రామయ్యా’కు టాక్ ఓకే అనిపించినా.. సినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో త్రికోఠికి మరో అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. ఆ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత ‘జువ్వ’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు త్రికోఠి.

ఈ సినిమా ఆడియో వేడుకలో త్రికోఠి స్పీచ్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. చాలా అమాయకంగా.. నిష్కల్మషంగా.. పెద్దగా చదువుకోని పల్లెటూరి వ్యక్తిని పెద్ద వేడుకలోకి తీసుకొచ్చి సన్మానం చేస్తే ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడాడు త్రికోఠి. కీరవాణి తన రెండు సినిమాలకూ సంగీతం అందించడం.. తనకు అండగా నిలవడం గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడతను. తన లాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్లను.. నాలాంటి బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లను ఎవరూ పట్టించుకోరని.. కానీ తనకు కీరవాణి అండగా నిలిచాడని.. రాజమౌళి, సాయికొర్రపాటి లాంటి వాళ్ల వల్లే తాను దర్శకుడిగా మారానని.. వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమోషనల్‌గా అన్నాడు త్రికోఠి. ‘థ్యాంక్స్’ సహా చాలా ఇంగ్లిష్ పదాల్ని సరిగా పలకలేక ఇబ్బంది పడుతూ త్రికోఠి చేసిన ప్రసంగం ఆడియో వేడుకకు వచ్చిన వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. త్రికోఠి ప్రసంగం ఎలా సాగిందో ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కావాలంటే ఒక లుక్కేయండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English