తొలి ప్రేమ.. ఇద్దరికీ పండగే

తొలి ప్రేమ.. ఇద్దరికీ పండగే

ఒక్క సినిమా విజయవంతమైతే చాలామంది దశ తిరిగిపోతుంది. ‘తొలి ప్రేమ’ చాలామందికి అలాంటి విజయాన్నే అందించేలా ఉంది. ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఆర్థికంగా ఇది చాలా మంచి ప్రయోజనమే కలిగించేలా కనిపిస్తోంది. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’ లాంటి దారుణమైన డిజాస్టర్‌తో రాజు ప్రయాణం మొదలైంది. ఆ సినిమా ద్వారా దాదాపు రూ.14 కోట్ల దాకా రాజు నష్టపోయినట్లు సమాచారం. ఇందులో సగం నిర్మాత సెటిల్ చేస్తున్నప్పటికీ.. మిగతా సగం కూడా పెద్ద మొత్తమే. ఇలాంటి సమయంలో ‘తొలి ప్రేమ’ను ఏకంగా రూ.18 కోట్లు పెట్టి హోల్ సేల్‌గా కొనేశాడు దిల్ రాజు. ఈ చిత్రంపై ఇది పెద్ద పెట్టుబడి అని.. రాజు రిస్క్ చేశాడని అన్నారు చాలామంది.

కానీ ‘తొలి ప్రేమ’ను దిల్ రాజే స్వయంగా నిర్మించాల్సింది. ఆ స్క్రిప్టుపై పూర్తి స్పష్టత ఉంది రాజుకి. కానీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాను వదిలేశాడు. ఐతే ఈ చిత్రాన్ని నిర్మించిన భోగవల్లి ప్రసాద్ కోరిక మేరకు ప్రివ్యూ చూసి, నచ్చి వాళ్లు ఆశించిన దాని కంటే ఎక్కువ రేటు పెట్టి ఈ సినిమాను కొన్నాడు రాజు. సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేసి భారీ ఎత్తున విడుదల చేశాడు. ఇప్పుడీ సినిమా రూ.25-30 కోట్ల మధ్య షేర్ రాబట్టేలా కనిపిస్తోంది. అంటే దిల్ రాజుకు రూ.10 కోట్ల దాకా లాభం ఖాయం. ఇక మంచి లాభానికే థియేట్రికల్ రైట్స్ అమ్మిన ప్రసాద్.. శాటిలైట్, ఇతర హక్కుల ద్వారా కూడా మంచి ఆదాయమే అందుకోబోతున్నాడు. మొత్తానికి ‘తొలి ప్రేమ’ డీల్ రాజుకు, ప్రసాద్‌కు ఉభయతారకంగా పని చేసి ఇద్దరికీ మంచి లాభాన్నిందించబోతోందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English