రామోజీ వారి ‘తొలి ప్రేమ’

రామోజీ వారి ‘తొలి ప్రేమ’

‘తొలి ప్రేమ’ సినిమాతో రామోజీ రావుకు ఏం సంబంధం అంటారా? కానీ సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమా టైటిల్ ను మళ్లీ వాడుకునే హక్కులు రామోజీ రావుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల దగ్గరే ఉన్నాయట. వాళ్లే ఈ టైటిల్‌ను మళ్లీ వాడుకోవడానికి రిజిస్టర్ చేయించి పెట్టారట. ఐతే ఎవరితో ఈ సినిమా తీయాలనుకున్నారో ఏమో కానీ.. ఆ ప్రాజెక్టు మాత్రం కార్యరూపం దాల్చలేదట. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తన సినిమాకు ఈ టైటిల్ పెడదామని అనుకున్నపుడు.. ఈ టైటిల్ ఉషాకిరణ్ వాళ్ల దగ్గర ఉందని తెలిసిందట. నిర్మాత భోగవల్లి ప్రసాద్ వాళ్లను సంప్రదించి టైటిల్ తీసుకున్నట్లు సమాచారం.

వరుణ్ సినిమాకు ‘తొలి ప్రేమ’ అనే టైటిల్ పెట్టినపుడు పవన్ కళ్యాణ్ క్రేజును క్యాష్ చేసుకోవడానికి.. ఈ సినిమాకు హైప్ తేవడానికే ఈ ప్రయత్నం అనుకున్నారంతా. ఐతే ఈ టైటిల్ పెట్టుకోవడం వల్ల అంచనాలు పెరిగి కథ అడ్డం తిరిగే ప్రమాదముందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. కానీ చిత్ర బృందం వెనక్కి తగ్గలేదు. అదే టైటిల్‌ ఖరారు చేసింది. ఈ టైటిల్ పెట్టినపుడు ముందు కొంచెం భయం వేసినప్పటికీ.. సినిమా ఔట్ పుట్ చూసుకున్నాక భయం పోయిందని.. అందుకే ఈ టైటిల్‌కు చెడ్డ పేరు మాత్రం రానివ్వమంటూ పవన్ అభిమానులకు ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట ఇచ్చానని.. ఇప్పుడా మాట నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని.. ఐతే తన సినిమాకు ‘తొలి ప్రేమ’ కాకుండా ఏ రోజూ వేరే టైటిల్ అనుకోలేదని వెంకీ అట్లూరి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English