ర‌జినీ ఇలా ఏడిపిస్తున్నాడేంటీ?

ర‌జినీ ఇలా ఏడిపిస్తున్నాడేంటీ?

రోబో సూప‌ర్ హిట్ కొట్టిన సినిమా. దానికి సీక్వెల్‌ గా 2.0 వ‌స్తోంది. కామ‌న్‌గానే ఆ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉంటాయి. కానీ ఏంటో ... ఆ సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.  అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారులే అనుకున్నాడే ఏమో... శంక‌ర్ ఆ సినిమాను మ‌రీ వెన‌క్కి పోస్ట్ పోన్ చేసుకుంటే వెళ్లిపోతున్నాడు.  

బాహుబ‌లి భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమా. ఆ సినిమాను బీట్ చేయాల‌ని శంక‌ర్ కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టు ఉన్నాడు. అందుకేనేమో భారీ గ్రాఫిక్స్ తో అందులోనూ చాలా క్వాలిటీ వ‌ర్క్ కావాలంటూ నెల‌ల‌కు నెల‌లు సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నాడు. లాస్ ఏంజ‌ల‌స్ లో వీఎఫ్ఎక్స్ చేయిస్తున్నాడు శంక‌ర్‌. కొన్ని నెల‌లుగా అక్క‌డే మ‌కాం వేశాడు. ఇంకా బాగా... ఇంకా బాగా... అంటూ ఇప్ప‌టికీ గ్రాఫిక్స్ వ‌ర్క్ చేయిస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుద‌ల‌వుతుందేమో అనుకున్నారంతా... ఇప్పుడు తేదీ ఆగ‌స్టుకు మారింద‌ట‌. తెలిసిన స‌మాచారం ప్ర‌కారం... సినిమా పంద్రాగస్టున.. అదేనండీ ఆగ‌స్టు 15న విడుద‌ల‌య్యే అవకాశం ఉందట. లేదంటే... మ‌రింత వెన‌క్కి వెళ్లే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. క‌నుక సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఇది తేదీ అని క‌చ్చితంగా చెప్ప‌లేం... ఒక‌వేళ ఎవ‌రైనా చెప్పినా న‌మ్మలేం.

అసలు సూపర్ స్టార్ ఆ డేటుకు ఎందుకు పారిపోయాడంటే.. శంక‌ర్ అతి వ‌ల్లే సినిమా బాగా లేటువుతోంద‌ని టాక్‌. అది నిజ‌మే కూడా కావ‌చ్చు. రోబో క‌న్నా పెద్ద హిట్ కొట్టాల‌ని, బాహుబ‌లిని అంద‌రూ మ‌ర్చిపోయేలా చేయాల‌న్న‌ది శంక‌ర్ ప్లాన్ కావ‌చ్చు. కాక‌పోతే మ‌రీ ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల అభిమానుల్లో విర‌క్తి కూడా పెరిగే అవ‌కాశం ఉంది క‌నుక‌. ఇప్ప‌టికైనా  విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు