ఒక్క హిట్టూ లేదు మూడో సినిమా ప‌ట్టింది

ఒక్క హిట్టూ లేదు మూడో సినిమా ప‌ట్టింది

చేసిన సినిమాల‌న్నీ ఫ్లాపులే అయినా మ‌ళ్లీ పెద్ద సినిమాలో అవ‌కాశం కొట్టేసింది నితిన్ పిల్ల‌. అదేనండి లై సినిమాలో హీరోయిన్ మేఘా ఆకాష్‌. ప్ర‌స్తుతం తెలుగులో ఈ అమ్మాయి రెండు సినిమాల్లో న‌టిస్తోంది. అందులోఒక‌టి రీమేక్ సినిమా.

త‌మిళంలో రెండేళ్ల క్రితం విడుద‌లై సూప‌ర్ హిట్ కొట్టిన సినిమా క‌నితాన్‌. ఈ సినిమాను త‌మిళ ద‌ర్శ‌కుడు టీఎన్ సంతోష్ తెర‌కెక్కించారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. నిఖిల్ హీరోగా చేస్తున్న ఆ సినిమాకు హీరోయిన్గా ఎవ‌రిని పెట్టాలా అని చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ అవ‌కాశం ఎవ‌రికి వ‌స్తుందా అని యంగ్ హీరోయిన్లంతా ఆశ‌గా ఎదురుచూశారు. అంతేకాదు త‌మిళ క‌నితాన్‌లో న‌టించిన కేథ‌రీన్ థ్రెసా కూడా త‌న‌కు ఆ ఛాన్స్ వ‌స్తుందేమోన‌ని చాలా ఆశ‌లు పెట్టుకుంది. త‌న‌ను సంప్ర‌దిస్తారేమోన‌ని ఎదురుచూసింద‌ట ముద్దుగుమ్మ‌. ఆ ఛాన్సును మేఘా ఆకాష్ త‌న్నుకుపోయిన‌ట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన‌ప్ప‌టికీ... దాదాపు మేఘానే పెట్టి సినిమా తీయాల‌ని ద‌ర్శ‌కుడు సంతోష్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట‌.

ఇప్ప‌టికే నితిన్ తో లై సినిమాలో ఆడిపాడిన ఈ పిల్ల రెండో సినిమా కూడా నితిన్ తోనే చేస్తోంది. ఛ‌ల్ మోహ‌న్ రంగా అనే సినిమాలో వీరిద్ద‌రూ మ‌ళ్లీ క‌నిపించ‌బోతున్నారు. ఏప్రిల్ 5న‌ ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఒక్క హిట్టు లేని పిల్ల‌కి  ఇలా వ‌రుస‌పెట్టి సినిమా అవ‌కాశాలు రావ‌డ‌మేంట‌ని గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి. ఆ అవ‌కాశాల వెనుక ఓ హీరో ఉన్నాడ‌ని రూమర్లు వినిపిస్తున్నాయి. అత‌నే సిఫార్సు చేసి సినిమాలు ఇప్పిస్తున్నాడ‌ట‌. అత‌ను ఎవ‌రై ఉండొచ్చు. మేఘా ఆకాష్ ఇప్ప‌టికి కేవలం నితిన్ తోనూ, ధ‌నుష్ తో మాత్ర‌మే చేసింది మరి. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English