వెంకీ అండ్ వెంకీ.. టాక్ ఆఫ్ ద టాలీవుడ్

వెంకీ అండ్ వెంకీ.. టాక్ ఆఫ్ ద టాలీవుడ్

వారం వ్యవధిలో ఇప్పుడు ఇద్దరు యువ దర్శకులు ఇండస్ట్రీకి రెండు మంచి హిట్లు ఇచ్చారు. ఆ ఇద్దరూ డెబ్యూ డైరెక్టర్లే కావడం విశేషం. ఇందులో ఒకరు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలై సూపర్ హిట్టయిన ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల కాగా.. మరొకరు ఈ వారాంతంలో మంచి టాక్‌తో మొదలై, అదిరిపోయే వసూళ్లు సాధిస్తున్న ‘తొలి ప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి. వీళ్లిద్దరి పేర్లు ఒకటే. నేపథ్యం కూడా ఒకలాంటిదే. ఇద్దరూ దర్శకులు కావడానికంటే ముందు నటులుగా కనిపించడం విశేషం. వెంకీ కుడుముల చిన్న చిన్న పాత్రలు చేస్తే.. వెంకీ అట్లూరి రెండు సినిమాల్లో హీరో వేషాలే వేశారు. వీళ్లిద్దరూ సినీ పరిశ్రమలో మరీ ఎక్కువ అనుభవమేమీ సంపాదించేయలేదు.

వెంకీ కుడుముల త్రివిక్రమ్ దగ్గర ‘అఆ’కు పని చేశాడంతే. ఇంకో ఒకట్రెండు సినిమాలకు దర్శకత్వ శాఖలో ఉన్నాడు. ఇక వెంకీ అట్లూరి ఎవరి దగ్గరా అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయనేలేదు. రెండు మూడు సినిమాలకు రచనలో పాలు పంచుకున్నాడంతే. ఇద్దరు యువ కథానాయకులు వీరిని నమ్మి సినిమాలు చేశారు. తొలి సినిమాల్లో వీరికి మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. వెంకీ కుడుముల పూర్తిగా వినోదం మీద దృష్టి పెట్టి సినిమాను నడిపిస్తే.. వెంకీ అట్లూరి ఫీల్ మీద.. రొమాన్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఇలా ఎవరికి వాళ్లు తమ బలాన్ని చాటుకున్నారు. ఈ యువ దర్శకుల గురించే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చించుకుంటోంది. వీళ్లిద్దరికి మంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ తలో రెండు సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు