సినిమాలు వదిలేస్తా అంటే తిట్టారట

 సినిమాలు వదిలేస్తా అంటే తిట్టారట

‘ఛలో’ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టు కొట్టాడు నాగశౌర్య. మంచి నటుడిగా, అందగాడిగా పేరు తెచ్చుకున్న శౌర్య.. ఇప్పుడు కమర్షియల్‌గానూ మంచి సక్సెస్ సాధించడంతో కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని భావిస్తున్నారు. ఇప్పుడతడికి మంచి మంచి అవకాశాలు కూడా వచ్చేలా ఉన్నాయి. ఐతే ఇప్పుడీ స్థాయిలో ఉన్న హీరో కొన్నేళ్ల కిందట మనకెందుకీ సినిమాలు.. వదిలేసి వేరే పనులేవో చేసుకుందాం అనుకున్నాడట. ఐతే అందరి ఇళ్లలో సినిమాలంటే తల్లిదండ్రులు ఎందుకు అని తిడతారని.. కానీ తన తల్లిదండ్రులు మాత్రం సినిమాలు వదిలేస్తా అంటే తిట్టారని నాగశౌర్య చెప్పడం విశేషం.

తాను సినిమాల్లోకి వెళ్తానంటే తన తల్లిదండ్రులు ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదని.. దీన్ని కూడా ఒక మంచి కెరీర్‌గానే చూశారని.. ఐతే కెరీర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఐదేళ్ల కిందట సినిమాలు మానేద్దామని అనుకున్నానని.. ఐతే అప్పుడు తన తల్లిదండ్రులే తనను వారించి సినిమాల్లో కొనసాగమంటూ ధైర్యం చెప్పారని శౌర్య వెల్లడించాడు. తన లాంటి హీరోలు ఒకవేళ సినిమా అవకాశాలు వచ్చినా వరుసగా రెండు ఫెయిల్యూర్లు వస్తే అల్లాడిపోతుంటారని.. కానీ మరో యంగ్ హీరో నితిన్ మాత్రం చాలా ఏళ్ల పాటు సక్సెస్ లేకుండా మొండి ధైర్యంతో కొనసాగాడని.. ఈ విషయంలో అతను తనకు స్ఫూర్తి అని నాగశౌర్య చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English