అఖిల్ పొగిడాడు.. ఏంటి సంగతి?

అఖిల్ పొగిడాడు.. ఏంటి సంగతి?

తన తొలి సినిమాను ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్త పడ్డాడో.. ఎంత సమయం తీసుకున్నాడో రెండో సినిమా విషయంలోనూ అలాగే చేశాడు అక్కినేని అఖిల్. కానీ ఈసారి కూడా అతడికి  ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పుడు మూడో సినిమా విషయంలోనూ అతను అదే సందిగ్ధతలో ఉన్నట్లున్నాడు. ‘మలుపు’ సినిమా తీసిన రవిరాజా పినిశెట్టి తనయుడు సత్యప్రభాస్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తాడని.. అదేం కాదు కొరటాల శివతో సినిమా ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. జనవరి 10నే తన తర్వాతి సినిమాను ప్రకటిస్తానన్న అఖిల్.. ఆ తేదీ పోయి నెల దాటినా అడ్రస్ లేడు.

ఈ మధ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అఖిల్ సినిమా అంటూ కొత్త రూమర్లు వినిపించాయి. కానీ పూరి ఇప్పుడున్న ఫాంలో నాగ్.. అఖిల్‌ను అతడి చేతిలో పెడతాడా అని సందేహాలు కలిగాయి. ఐతే ‘మెహబూబా’ టీజర్ చూశాక పూరి మారాడని.. హి ఈజ్ బ్యాక్ అన్న కామెంట్లు వినిపించాయి. ఈ టీజర్‌ను అఖిల్ పొగడటం కూడా అనుమానాలు రేకెత్తించింది. అఖిల్ ట్విట్టర్లో అన్ని సినిమాల గురించీ ఏమీ స్పందించడు. ఇప్పుడు పూరి టీజర్ చూసి స్పందించాల్సిన అవసరం అతడికి లేదు. ఈ మధ్య కాలంలో ఎన్నో ఫస్ట్ లుక్‌లు, టీజర్లు, ట్రైలరర్లు వచ్చినా రెస్పాండవని అఖిల్.. సెలక్టివ్‌గా దీని గురించే స్పందించి పూరిని పొగిడాడంటే ఏదో మతలబు ఉందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒకవేళ ‘మెహబూబా’ ఔట్ పుట్ చూసి మెచ్చి.. నాగ్ పూరికి కొడుకును అప్పగించడానికి ఓకే చెప్పాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు