ధర్మాభాయ్ అయితే.. అక్కడైనా ఆడేదేమో

ధర్మాభాయ్ అయితే.. అక్కడైనా ఆడేదేమో

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా చేసిన సినిమా ఇంటెలిజెంట్‌. దీనిని ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేశారు. ఆ సినిమా చూసొచ్చాక ప్రేక్ష‌కుల రియాక్ష‌ను గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అనుకుంటున్నాం. రివ్యూలు కూడా సినిమాను ఏకిప‌డేశాయి. ఇంటెలిజెంట్ టైటిల్ తోనే ఆడుకున్న‌ట్టు క‌నిపించాయి. ఆ టైటిల్ విష‌యంలోనే సాయిధ‌ర‌మ్ తేజూ మొద‌ట్నించి అస‌హ‌నంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాకు ఇంటెలిజెంట్ అనే టైటిల్ కు బ‌దులు మాస్ జ‌నాల‌కు ద‌గ్గ‌రయ్యే పేరును పెట్టాల‌ని వినాయ‌క్‌కు సూచించిన‌ట్టు స‌మాచారం. ధ‌ర్మాభాయ్ అనే పేరును కూడా సూచించిన‌ట్టు తెలుస్తోంది. ధ‌ర్మాభాయ్ టైటిల్ బీ, సీ సెంట‌ర్ల వారికి బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని చెప్పాడ‌ట తేజూ. వినాయ‌క్ మాత్రం ఇంటెలిజెంట్ టైటిల్ మాత్ర‌మే బాగుంటుంద‌ని... సినిమాలో హీరో తెలివిగా చేసే ప‌నులు... టైటిల్ బాగా ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని చెప్పాడ‌ట‌. తేజూ వినాయ‌క్‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేద‌ట‌. చివ‌రికి ఇంటెలిజెంట్ పేరుమీదే విడుద‌లై... అట్ట‌ర్ ఫ్లాప‌యింది. దీంతో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ చాలా అస‌హ‌నంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇంటెలిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్ర పోషించాడు తేజూ. వ‌రుస‌గా నాలుగు ఫ్లాపు సినిమాల‌తో ఇబ్బందుల్లో ఉన్న సాయి ధ‌ర‌మ్‌కు ఇంటెలిజెంట్ పై చాలా ఆశ‌లు ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా ఆ జాబితాలోనే చేరిపోవ‌డం కాస్త ఇబ్బందే. ఇందులో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా న‌టించింది. సి క‌ళ్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English