పిక్ టాక్: కాస్మో వెలుగులు కుమారి

పిక్ టాక్: కాస్మో వెలుగులు కుమారి

ఇప్పుడు ఇండియాకు దొరికిన లేటేస్టు అందం మానుషి చిల్లర్. కుమారి ప్రపంచం.. అదేనండీ మిస్ వర‌ల్డ్ కిరీటాన్ని గెలుచుకుని దేశానికి తిరిగొచ్చాక ఆమె చాలా బిజీ అయిపోయింది. ఫోటోషూట్ల‌తో, కార్య‌క్ర‌మాల‌తో దేశ‌మంతా తిరుగుతోంది. ఇదిగో ఇప్పుడు కాస్మోపాలిట‌న్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పై మెరిసింది. హాట్ లుక్స్ తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది.

హ‌ర్యాణా పిల్ల మానుషి చిల్ల‌ర్. మిస్ ఇండియాగా గెలిచి మ‌న దేశం త‌ర‌ఫున మిస్ వ‌ర‌ల్ట్ పోటీల‌కు వెళ్లింది. మిగ‌తా దేశాల అందగ‌త్తెల‌ను త‌న సౌంద‌ర్యంతో, మాట‌ల చాతుర్యంతో ఓడించి మిస్ వ‌రల్ట్ కిరీటాన్ని గెలుచుకుంది.  దాదాపు 17 ఏళ్ల త‌రువాత  మ‌న‌కు మ‌ళ్లీ మిస్ట్ వ‌ర‌ల్డ్ కిరీటం ద‌క్క‌డంతో... దేశంలో ఆమె సెలెబ్రిటీ అయిపోయింది.  బ్రెయిన్ విత్ బ్యూటీగా మెరిసిన ఈ పిల్ల బాలీవుడ్ కనిపించే స‌మ‌యం ఎంతో దూరంలో లేద‌నిపిస్తోంది. అందుకే ముందుగా క‌వ‌ర్ పేజీల‌తో హాట్ హాట్ గా క‌నిపిస్తోంది.

ప్ర‌ముఖ లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ కాస్మోపాలిట‌న్ పై ప‌సుపు, న‌లుపు డ్రెస్సుతో అద‌ర‌గొట్టింది. క‌నీ క‌నిపించ‌ని అందాల క‌నువిందు చేసింది. ముఖంలో కూడా హీరోయిన్ ఛాయ‌లు క‌నిపించేస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 14 కోసం  ద ల‌వ్ ఇష్యూ పేరుతో ఈ పుస్త‌కాన్ని ముద్రించారు కాస్మోపాటిన్ వారు. అక్క‌డ చోటు ద‌క్కించుకోవ‌డం మానుషి కెరీర్ కు ప్ల‌స్ పాయింటే అవుతుంది. తెరంగేట్రం ఎప్పుడు చేస్తోందో చూడాలి? ఏ ద‌ర్శ‌కుడు ఆమెను తెర‌కు ప‌రిచ‌యం చేస్తాడో మ‌రి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు