రెడీ అవుతున్న‌ చ‌ర‌ణ్ న్యూలుక్...

రెడీ అవుతున్న‌ చ‌ర‌ణ్ న్యూలుక్...

రంగ‌స్థ‌లం 1985లో చెర్రీ గుబురు గ‌డ్డాల‌తో, త‌ల‌నిండా జుట్టుతో క‌నిపించాడు. దాదాపు ప‌దినెల‌ల పాటూ అదే లుక్ లో ఉన్నాడు. రంగ‌స్థ‌లం సినిమాపై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్నారు చెర్రీ. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మాత్ర‌మే మిగిలాయి. ఇప్పుడు త‌న త‌రువాతి సినిమా కోసం న్యూలుక్ ట్రై చేస్తున్నాడు చెర్రీ.

సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో చెర్రీ చేసిన సినిమా రంగ‌స్థ‌లం. సుకుమార్ డైరక్షన్లో వస్తున్న సినిమాలో పూర్తి మాస్ లుక్ లో అద‌ర‌గొడుతున్నాడు చెర్రీ. చిట్టిబాబు టీజ‌ర్ ఇప్ప‌టికే పెద్ద హిట్ కొట్టింది. సౌండ్‌లెస్ చిట్టిబాబు గెట‌ప్ కు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. పెదాల క‌దలిక‌ల‌ను బట్టి మాట‌ల‌ను ప‌ట్టేస్తుంటాడు మ‌న చెవిటి చిట్టిబాబు. ఆ సినిమా రాక కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆ సినిమా త‌రువాత చ‌ర‌ణ్ బోయ‌పాటి శ్రీను తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. నిన్న‌టి వ‌ర‌కు గుబురు గ‌డ్డాల‌తో క‌నిపించిన చెర్రీ... ఇప్పుడు ట్రిమ్ చేసుకోబోతున్నాడు.

అంతేకాదు...హెయిర్ స్టైల్ కూడా మార్చాల‌నుకుంటున్నాడు. అందుకోసం ముంబై నుంచి ప్ర‌త్యేకంగా ఓ హెయిర్ స్టైలిస్ట్ ను ర‌ప్పించాడు. అత‌ను చెర్రీకి వివిధ ర‌కాల హెయిర్ స్టైలింగ్ చేసి చూపించ‌బోతున్నాడు. అందులో ఏదో ఒక‌టి బోయ‌పాటి శ్రీను సినిమాకు సెట్ అవ్వ‌నుంది. ఇక గెడ్డం మాత్రం గీసి పారేస్తాడ‌ని స‌మాచారం. క‌నుక చెర్రీ నిజంగానే కాస్త కొత్త‌గా క‌నిపించే అవ‌కాశం ఉంది. రంగ‌స్థ‌లం లుక్ కు భిన్నంగా ఉండ‌బోతోంది చెర్రీ న్యూ గెట‌ప్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English