అఖిల్ బాబూ మరీ అంత రిస్క్ అవసరమా?

అఖిల్ బాబూ మరీ అంత రిస్క్ అవసరమా?

ఒక‌ప్పుడు వ‌ర్మ పెద్ద ద‌ర్శ‌కుడు కావ‌చ్చు... ఆ త‌రువాత ఆయ‌న తీసిన పిచ్చి సినిమాలు, తెచ్చి పెట్టుకున్న వివాదాల‌తో వ‌ర్మ అంటేనే బెంబేలెత్తి పోతున్నారు సినీ జ‌నాలు. ఆయ‌న‌తో సినిమా చేయాలంటే కాస్త ధైర్యం కావాల్సిందే. మ‌రో ఫ్లాపుకు సిద్ధంగా ఉండాల్సిందేన‌న్న అభిప్రాయానికి వ‌చ్చేశారు సినీ జ‌నాలు. అలాంటిది ఓ యంగ్ హీరో ప‌ట్టుబ‌ట్టి మ‌రీ వ‌ర్మ‌తో సినిమా చేయడానికి సిద్ధ‌ప‌డుతున్నాడట‌.

ప్ర‌స్తుతం వ‌ర్మ నాగార్జునతో ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా తీస్తున్నాడు. ముంబై నేప‌థ్యంలో క‌థంతా న‌డుస్తుంది. అందులో నాగ్ పోలీసుగా న‌టిస్తున్నాడ‌ట‌. కాగా అఖిల్ కూడా వ‌ర్మ‌తోనే చేయాల‌ని ఉబ‌లాటం ప‌డుతున్నాడ‌ట‌. అస‌లే అఖిల్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌... ఇక హలో సినిమా ఫ‌ర్వాలేద‌నిపించింద‌... ఇంత‌వ‌ర‌కు హిట్ మాత్రం ప‌డ‌లేదు ఖాతాలో. ఇలాంటి స‌మ‌యంలో అఖిల్ ఎందుకో మ‌రి వ‌ర్మ‌తో చేయాల‌ని ఉబ‌లాడప‌డుతున్నాడంటున్నారు అక్కినేని అభిమానులు. పోయిపోయి వ‌ర్మ‌తో సినిమా ఏంట్రా అని త‌ల‌కొట్టుకుంటున్న‌వాళ్లు ఉన్నారు. కానీ అఖిల్ మాత్రం వ‌ర్మ‌తోనే సినిమా చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టుకుని కూర్చున్నాడ‌ట‌.

వ‌ర్మ త‌న అసిస్టెంట్ మంజుని అఖిల్ కోసం ఒక క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పాడు. అంతేకాదు త‌న ప‌ర్య‌వేక్ష‌ణంలో త‌న అసిస్టెంట్ డైరెక్ట్ చేస్తాడ‌ని చెప్పాడ‌ట అఖిల్ కి. కుర్ర హీరో మాత్రం నాకు మీ అసిస్టెంట్ వ‌ద్దు.. మీరే డైరెక్ట్ చేయండి అని కోరాడ‌ట‌. దీంతో చేసేదేమీ లేక ఒప్పుకున్నాడ‌ట వ‌ర్మ‌. అంతేకాదు అఖిల్‌-వ‌ర్మ కాంబినేష‌న్లో ఓ టీజ‌ర్ కూడా చూసుకున్నారు. బాగుండ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. ఇంకా క‌థ రెడీ కావాల్సి ఉంది. అస‌లే అఖిల్ కెరీర్ అటుఇటుగా ఉన్న స‌మ‌యంలో వ‌ర్మ‌తో సినిమా చేయ‌డానికి పిల్లాడికి ధైర్యం ఎక్కువే అంటున్నారు సినీ జ‌నాలు. త‌న అన్న‌తో బెజ‌వాడ తీసి అట్ట‌ర్ ఫ్లాపు చేసిన వ‌ర్మలో అఖిల్‌కు అంత‌గా ఏం న‌చ్చేసిందో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు