ఆసుప‌త్రిలో బిగ్ బి!

ఆసుప‌త్రిలో బిగ్ బి!

యావ‌త్ దేశానికి సూప‌ర్ స్టార్ గా ఓకే చేసే న‌టుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అని చెప్పాలి. వ‌య‌సు మీద ప‌డుతున్నా.. ఉత్సాహంతో ప‌ని చేసే విష‌యంలో అమితాబ్ ఇప్ప‌టి త‌రంతోనూ పోటీ ప‌డ‌గ‌లే స‌త్తా ఉంది. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ అస్వ‌స్థ‌త‌కు గురి అవుతున్న అమితాబ్ తాజాగా మ‌రోసారి ఆరోగ్య స‌మ‌స్య‌తో ఆసుప‌త్రిలో చేరిన‌ట్లుగా తెలుస్తోంది.

శుక్ర‌వారం సాయంత్రం స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన బిగ్ బీని ముంబ‌యిలోని లీలావ‌తి ఆసుప‌త్రిలో చేర్చారు. గ‌డిచిన కొంత‌కాలంగా జీర్ణాశ‌య‌.. మెడ‌.. వెన్నుముక నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. తాజాగా వెన్నుముక కింది భాగంలో నొప్పి ఎక్కువ కావ‌టంతో ఆసుప‌త్రిలో చేర్చిన‌ట్లుగా తెలుస్తోంది.

75 ఏళ్ల బిగ్ బీ ఇప్ప‌టికి సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. త‌న‌దైన శైలిలో సినిమాలు చేసే ఆయ‌న‌.. ప్ర‌స్తుతం 102 నాటౌట్‌.. అనే చిత్రంలో న‌టిస్తున్నారు. గుజ‌రాత్ నాటిక ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో విడుద‌ల కానుంది.

ఇదిలా ఉండ‌గా.. న‌డుం కింది భాగ‌మైన లుంబార్ లో అమితాబ్ కు నొప్పి చేసింద‌ని.. కొన్ని మందులు.. ఇంజెక్ష‌న్లు ఇవ్వ‌టంతో నొప్పి త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు చెబుతున్నారు.  శుక్ర‌వారం రాత్రి ఆయ‌న్ను ఆసుప‌త్రిలో చేర్చినా.. స్వ‌ల్ప చికిత్స అనంత‌రం డిశ్చార్జ్ చేసిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికైతే త‌న హెల్త్ కండీష‌న్ మీద బిగ్ బీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English