బికినీ వేశాక‌... మ‌ళ్లీ కొటేష‌న్ ఏంటో

బికినీ వేశాక‌... మ‌ళ్లీ కొటేష‌న్ ఏంటో

స‌మంత చాలా డిఫ‌రెంట్‌. తాను చేయాల‌నుకున్న‌ది చేసేస్తుంది. పెళ్ల‌య్యాక అక్కినేని ఫ్యామిలీయే త‌న వెనుకుంద‌న్న ధైర్య‌మో ఏంటో మ‌రీ బోల్డ్‌గా అయిపోతోంది. నిన్న‌టికీ నిన్న బికినీ ఫోటో ఒక‌టి పోస్టు చేసి, ఈ రోజు ఓ కొటేష‌న్‌ను రాసి ప‌డేసింది. ఆ కొటేష‌న్ చ‌దువుతుంటే ఏదో చెప్పాల‌నుకుంటోంద‌ని మాత్రం అర్థ‌మైపోతోంది.

రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి సినిమాల‌తో చాలా బిజీ షెడ్యూల్ గడిపింది సామ్‌. రంగస్థ‌లం షూటింగ్ ముగియ‌డంతో కాస్త వెకేష‌న్ దొరికిన‌ట్టుంది. ఎక్క‌డో బీచ్‌కి వెళ్లి అక్క‌డ ఊయ‌ల‌లో ఊగుతూ, బికినీలో ఓ హాట్ ఫోటోను తీసుకుని, దానిని ఇన్ స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఆ పోస్టుకు కొంద‌రు అబ్బా ఏం ఉన్నావు అని మెచ్చుకుంటుంటే.. కొంద‌రు మాత్రం ఏకి ప‌డేశారు. ఇదేం ప‌ని సామ్‌, ఏమైంది నీకు అని కొంద‌రు ఆశ్చ‌ర్య‌పడ్డారు. మ‌రికొంద‌రు ఇంత‌వ‌ర‌కు నేను నీ అభిమానిని, ఈ ఫోటో చూశాక ఐ హేట్ యూ అని పోస్టులు పెట్టారు. ఇవ‌న్నీ స‌మంత చూసిన‌ట్టే ఉంది. అందుకేనేమో మ‌రుస‌టి రోజే ఆమె ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో ఓ స్ట్రాంగ్ కొటేష‌న్ క‌నిపించింది.

ధృడ చిత్తం క‌ల మ‌హిళ‌...స్త్రీ ఏం చేయ‌గ‌ల‌దో నిర్ణ‌యించగ‌ల‌దు, కానీ ఇత‌రులు ఆ విష‌యాన్ని నిర్ణ‌యించ‌రాదు అని కోట్ పెట్టింది. అంతే తాను ఏం చేయాలో, ఏం చేయ‌కూడ‌దో త‌న‌కు బాగా తెలుస‌ని, ఎవ‌రూ చెప్ప‌క్క‌ర్లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు కూడా.  దీనిని బ‌ట్టి నా బికినీ నా ఇష్టం అని ఆమె చెప్ప‌క‌నే చెబుతున్న‌ట్టుగా లేదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు