డబ్బులు అడగకుండా వదిలేసిందా??

 డబ్బులు అడగకుండా వదిలేసిందా??

శ్రీదేవి... అప్పట్లో ఎందరికో కలల రాణి. ఆమె కోసం ప్రాణాలు కూడా ఇచ్చేసేంత వీరాభిమానులు ఉండేవారంటారు.  దక్షిణాది నుంచి వెళ్లి ఉత్తరాదిని ఊపేసిన అందం ఆమెది. సినిమాలు మానేసినా, చేసినా సినిమాలు అట్టర్ ఫ్లాపయినా శ్రీదేవి అభిమానులకు అవేమీ పట్టవు. ముఖంపై ముడతలు పడినా కూడా ఆమె అందానికి అధిదేవతేనని ఫీలవుతారు. అలాంటి వీరాభిమానే ఒకరు శ్రీదేవి పేరుత్ రెస్టారెంట్ పెడుతున్నాడు. తన రెస్టారెంట్ లో దొరికే ఐటెమ్స్ కు ఏదో ఒక శ్రీదేవి సినిమా పేరే పెట్టాలని నిర్ణయించాడు. మరి శ్రీదేవి ఊరుకుంటుందా?

శ్రీదేవి కనిపించేంత సాఫ్టేమీ కాదు. ఎవరికీ తన పేరును ఊరికే వాడుకోనియ్యదు. ఎవరైనా అలా తన అనుమతి లేకుండా వాడితే లీగల్ నోటీసులు పంపిస్తుంది. ఒకసారి రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి అని సినిమా పేరు పెడితే... ఆయనకు వెంటనే లీగల్ నోటీసులు పంపింది. అందులోనూ వర్మ ఆమెకు క్షణక్షణం, గోవిందా గోవిందా లాంటి హిట్ సినిమాలు ఇచ్చాడు. అయినా సరే అతడిని క్షమించలేదు. అలాంటిది ముక్కూ ముఖం తెలియని వ్యక్తి తన పేరుతో రెస్టారెంట్, అందులో వంటకాలకు తన సినిమా పేర్లు పెడతానంటే శ్రీదేవి ఊరుకుంటుందా? అని చర్చించుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. లేక అతను ముందే శ్రీదేవి అనుమతి తీసుకునే పెడుతున్నాడా అని టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీదేవి వచ్చే డబ్బును అంత సులువుగా వదిలేయదు అన్న కామెంట్లు సినీజనాల్లో వినిపిస్తున్నాయి. డబ్బులంటే అమితంగా ఇష్టపడే అందాల సుందరి... తన పేరు ఫ్రీగా వాడుకోనిస్తుందా అన్న వాదనలు లేకపోలేదు. అసలు నిజమేంటో... ఆ శ్రీదేవికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు