స‌మంత‌కు ఇంత అవ‌స‌రం ఏమొచ్చింది?

స‌మంత‌కు ఇంత అవ‌స‌రం ఏమొచ్చింది?

అక్కినేని వారి ఇంటి కోడ‌లు అయ్యాక సామ్ ప‌ర‌ప‌తి పెరిగిపోయింది. ఆమెను ప్ర‌భుత్వం కూడా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు పిల‌వ‌డం ప్రారంభించింది. స‌మంతకు ఫాలోయింగ్ ఏ మాయే చేశావే సినిమా నుంచే ప్రారంభ‌మైంది. ఇప్పుడు ఈ పెళ్లితో మ‌రింత‌గా ఫాలోయింగ్ పెరిగిపోయింది. సినిమాల లో అవ‌కాశాలు కూడా ఎక్కువే వ‌స్తున్నాయి. కానీ స‌మంతా గ‌తేడాది నుంచి... ఎందుకోగానీ హాట్ హాట్ డ్రెస్సుల‌తో, లుక్స్‌తో రెచ్చ‌గొడుతోంది. ఇంత‌లా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు సామ్ ఎందుకు తెర‌తీసింద‌నేది ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చ అయిపోయింది.

నాగ‌చైత‌న్య‌తో పెళ్ల‌య్యాక స‌మంత మ‌రింత ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపిస్తుంద‌ని, ఇక ఆమెతో సినిమాలంటే కాస్త జాగ్ర‌త్త‌గా తీయ‌ని అనుకున్నారంతా. వారు అనుకున్న‌ది ఒక‌టైతే... ఇక్క‌డ స‌మంతా చేస్తున్న‌ది మ‌రొక‌టి. అమ్మ‌డు పెళ్లికి సెటిలైన‌ప్ప‌టి నుంచే చిట్టి పొట్టి దుస్తుల‌తో రెచ్చిపోతోంది. అంతెందుకు పెళ్లికి ముందు ఆమె జెఎఫ్‌డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై మెరిసింది. చేనేత‌కు మ‌ద్ద‌తుగా నేత నేచిన బికినీలో మెరిసింది. చేనేతతో కూడా ఇంత‌గా అందాల ప్ర‌దర్శ‌న చేయ‌చ్చా అనేంత‌గా... ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసి అక్కినేని అభిమానుల‌కు దిమ్మ‌తిరిగి పోయి ఉంటుంద‌న్న కామెంట్లు వినిపించాయి.

ఇక న్యూఇయ‌ర్ వేడుక‌లో కూడా పొట్టి గౌనుతో సంద‌డి చేసింది. అది కూడా భ‌ర్త ప‌క్క‌నుండ‌గానే సోకులు దారబోసింది. ఇలా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది స‌మంత‌. ఒక‌సారి స్విమ్మింగ్ పూల్ లోదిగుతూ... బికినీలో వెన‌క‌వైపు నుంచి ఫోటోలు పెట్టింది. తాజాగా ఏకంగా బీచ్‌లో ఊయ‌ల‌లో బికీనీలో ఉన్న ఫోటోను పోస్టు చేసింది. షూటింగ్ లో అల‌సిపోయాన‌ని... వెకేష‌న్‌లో ఉన్నాన‌ని ఆ ఫోటోకు క్యాప్ష‌న్ పెట్టింది. ఆమెను అలా చూసిన అభిమానులు కొంద‌రు గుండెలు బ‌ద్ద‌ల‌య్యాయి. నువ్వు ఇలా ఫోటోలు పెడ‌తావ‌ని ఊహించ‌లేదు అంటూ కామెంట్లు పెట్టారు. కొంద‌రేమో ఐ హేట్ యూ అని కామెంట్ పెట్టారు. స‌మంత మాత్రం అవ‌న్నీ ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో లేదు. మ‌రి అక్కినేని వారి ఫ్యామిలీ కూడా ఈ ఫోటోను చూసి ఏం ఫీల‌వుతుందో.

అస‌లు ఇంత‌లా ఎక్స్ పోజింగ్ చేసేం అవ‌స‌రం స‌మంత‌కి ఏమొచ్చింది? ఆమెకు చేతిలో సినిమాలు లేవా? అంటే అదీ లేదు. చేతినిండా సినిమాలే. ఈ ఏడాదే ఆరు సినిమాల వ‌ర‌కు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. పోనీ సినిమాల‌కు బ్రేకిచ్చిన హీరోయిన్నా.. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నా అని ఇలా ఫోటోల ద్వారా చెప్ప‌డానికి అంటే.. అదీ కాదు. లేదంటే అక్కినేని వారి కోడలు అన్న గౌర‌వ‌ంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు గ్లామ‌ర‌స్ పాత్ర‌లు ఇవ్వ‌కుండా పోతార‌ని సామ్ కు బెంగ‌ప‌ట్టుకుందో ఏమో... పెళ్ల‌యినా కూడా తాను అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు గ్లామ‌ర‌స్ పాత్ర‌లు చేయ‌డానికి రెడీ అని చెప్ప‌క‌నే చెబుతున్న‌ట్టు ఈ ఫోటోలు పెట్టేస్తోంది భామామణి అంటున్నారు జనాలు. ఇక అస‌లు నిజ‌మేంటో స‌మంత‌కే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English