జవాన్ ఎందుకు పోయిందంటే..

 జవాన్ ఎందుకు పోయిందంటే..

వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న తనను ‘జవాన్’ సినిమా బయట పడేస్తుందని చాలా ధీమాగా ఉన్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమాలో దిల్ రాజు హ్యాండ్ కూడా ఉండటం.. రిలీజ్ వాయిదా వేసి మరీ మధ్యలో రిపేర్లు కూడా చేసి సినిమాను తీర్చిదిద్దడం.. దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ విషయంలో సూపర్ కాన్ఫిడెన్స్ చూపించడంతో తేజు కూడా భరోసాతో ఉన్నాడు.

ఐతే తేజు గత సినిమాలతో పోలిస్తే దీనికి మంచి టాకే వచ్చినప్పటికీ సినిమా నిలవలేదు. ఇది కూడా తేజు ఫ్లాపుల ఖాతాలో చేరిపోయింది. మరి తప్పెక్కడ జరిగిందన్నది తనకు కొంచెం ఆలస్యంగా అర్థమైందని తేజు చెప్పాడు.

‘జవాన్’ సినిమాలో హీరో పక్కనే విలన్ ఉంటూ మైండ్ గేమ్ ఆడటం అనే పాయింట్ తనకు బాగా నచ్చి, కొత్తగా అనిపించి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాని తేజు చెప్పాడు. కానీ అది మినహాయిస్తే ఇందులో పెద్దగా కథ లేకపోవడం తప్పైందని తేజు చెప్పాడు. ఐతే ఈ సినిమా ఫలితం విషయంలో దర్శకుడు బి.వి.ఎస్.రవిని తాను నిందించనని చెప్పాడు. ఎందుకంటే తాను ఓకే చేశాకే ఈ సినిమా పట్టాలెక్కిందని.. కాబట్టి ఆ సినిమా ఫలితానికి తాను కూడా బాధ్యుడినే అని తేజు స్పష్టం చేశాడు.

తాను ‘సుప్రీమ్’ సినిమా చేస్తున్నపుడు రాజేంద్ర ప్రసాద్ ఒక మాట చెప్పాడని.. ఈ పాత్ర రాలేదు.. ఆ పాత్ర రాలేదు అనుకోకూడదని. మన దగ్గరకు వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంచుకుని ముందుకెళ్లిపోవాలని ఆయన చెప్పిన మాటను తాను ఫాలో అవుతున్నానని తేజు చెప్పాడు. అతడి కొత్త సినిమా ‘ఇంటిలిజెంట్’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English