బ్లాక్‌బస్టర్ హీరోయిన్.. ఇన్నాళ్లకు ఒక ఛాన్స్

బ్లాక్‌బస్టర్ హీరోయిన్.. ఇన్నాళ్లకు ఒక ఛాన్స్

ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన కథానాయికకు ఆటోమేటిగ్గా ఛాన్సులు వెల్లువెత్తుతాయి. అందులోనూ ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చినపుడు.. నటనకు ప్రశంసలు దక్కినపుడు ఆ కథానాయిక కచ్చితంగా బిజీ అయిపోతుంది. కానీ తమిళ కథానాయిక నందిత శ్వేత విషయంలో మాత్రం అలా జరగలేదు. ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాలో ఆమె పాత్ర భలేగా పేలింది. తన నటనకు మంచి పేరొచ్చింది. కానీ ఆ చిత్రం విడుదలై ఏడాది దాటినా ఆమెకు తెలుగులో మరో అవకాశం రాలేదు. ఇక నందితను ఎవ్వరూ పట్టించుకోరులే అనుకుంటున్నసమయంలో ఎట్టకేలకు ఆమెకు ఇక్కడ రెండో అవకాశం దక్కింది.

దిల్ రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న తెరకెక్కించబోయే తర్వాతి సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’లో నందిత శ్వేతనే కథానాయికగా ఎంచుకున్నారు. మరి ఈ చిత్రంతో నందిత ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో.. ఆమె కెరీర్ ఏమాత్రం ఊపందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి స్క్రిప్టు.. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. మార్చిలోనే ‘శ్రీనివాస కళ్యాణం’ సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ చిత్రం గత ఏడాదే మొదలుకావాల్సింది. ఐతే హీరో విషయంలో తర్జనభర్జనలు నడిచాయి. ఎన్టీఆర్ అని.. సాయిధరమ్ తేజ్ అని.. రకరకాల పేర్లు వినిపించాయి. చివరికి నితిన్ హీరోగా కన్ఫమ్ అయ్యాడు. ‘దిల్’ తర్వాత రాజు నిర్మాణంలో నితిన్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు