పిల్లల కోసమే అనుష్క పెళ్ళి

పిల్లల కోసమే అనుష్క పెళ్ళి

ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అనుష్క పెళ్లే. ఆమె పెళ్లి గురించి ఎన్ని రూమ‌ర్లో. అయినా అవేవీ అనుష్క ప‌ట్టించుకున్న‌ట్టే క‌నిపించ‌లేదు. ఎందుకో ఇప్పుడు మాత్రం పెళ్లి గురించి త‌న మ‌న‌సులో మాట చెప్పేసింది. అనుష్క పెళ్లి క‌న్నా... త‌ల్ల‌వ్వ‌డానికే ఎక్కువ ఇష్ట‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ఏడాదిలో టాలీవుడ్‌లో విడుద‌లైన పెద్ద సినిమా భాగ‌మ‌తి. ఈ ఏడాది మొద‌టి హిట్‌ను కొట్టింది. అందులో అనుష్కే వ‌న్ మ్యాన్ ఆర్మీలా క‌ధ‌ను న‌డిపించింది. ఆమె హీరో, ఆమెనే హీరోయిన్‌, ఒక ద‌శ‌లో భాగ‌మ‌తి రూపంలో ఆమెనే విల‌న్ లా కూడా క‌నిపించింది. స్వీటీ న‌ట‌న‌కు వంద‌కు వంద మార్కులు వ‌చ్చేశాయి. సినిమాల ప‌రంగా ఆమె మీద ఏ విమ‌ర్శ లేదు కానీ... వ్య‌క్తిగ‌తంగా మాత్రం అనుష్క ప్ర‌భాస్‌తో ల‌వ్‌లో ప‌డిందంటూ ఒక‌టే గుస‌గుస‌లు. ఇప్పుడు కాదు.. ఎప్ప‌టి నుంచో ఈ గుస‌గుస‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌భాస్ ఒక్క‌సారి కూడా  ఈ విష‌యాల‌పై నోరు విప్ప‌లేదు కానీ ... జేజ‌మ్మ మాత్రం అలాంటిదేమీ లేద‌ని, అత‌ను ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చింది. తాజాగా త‌న పెళ్లి గురించి అతిగా ఆలోచించ‌వ‌ద్ద‌ని అభిమానుల‌కు స‌ల‌హా ఇచ్చింది.

త‌న‌కు పిల్ల‌లంటే చాలా ఇష్ట‌మ‌ని, వారిని క‌న‌డం కోస‌మైనా క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పింది. త‌న పెళ్లి సంగ‌తి తానే స్వ‌యంగా ప్ర‌క‌టిస్తాన‌ని... ఈలోపు ఏ రూమ‌ర్ల‌ను న‌మ్మ‌ద్ద‌ని చెప్పింది. త్వ‌ర‌లోనే త‌న పెళ్లి ఉంటుంద‌ని చెప్పింది. ఇప్ప‌టికే అనుష్క‌కు 36 ఏళ్లు... ఆమె ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డం ఆమె అభిమానులను క‌ల‌చివేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌నుక స్వీటీ... నువ్వు త్వ‌ర‌గా పెళ్లి చేసేసుకుంట‌నే బెటర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు