ఆ వీడియోలు దిలీప్ చూడచ్చట!!

ఆ వీడియోలు దిలీప్ చూడచ్చట!!

మలయాళ హీరో దిలీప్ కోర్టు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఓ మలయాళ నటిని కిడ్నాప్ చేయించి.. వేధింపులకు గురి చేసి ఆ వీడియోలను తీయించిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు దిలీప్. దాదాపు 3 నెలల పాటు జైలులో విచారణను ఎదుర్కొన్న దిలీప్ రీసెంట్ గానే బయటకు వచ్చాడు.

650 పేజీలకు పైగా ఛార్జిషీట్ ను దాఖలు చేసి మరీ విచారణ జరుపుతున్న ఈ కేసు.. త్వరలో హియరింగ్ కు రానుంది. ఈ సమయంలో తనపై ఆరోపణలకు కారణమైన వీడియోలు.. ఫోటోలను అందించాల్సిందిగా తన లాయర్ ద్వారా కోర్టును కోరాడు. అయితే.. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇవి ఓ మహిళ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం కావడంతో.. ముద్దాయి కోరిన వీడియోలు- ఫోటోలను ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు తేల్చేసింది. కానీ ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కావడంతో.. ఆయా వీడియోలను తన లాయర్ తో కలిసి చూసేందుకు మాత్రం కోర్టు అనుమతించింది.

ఈ వీడియోలు దుర్వినియోగానికి గురి కావచ్చనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. పల్సర్ సుని అనే వ్యక్తి ద్వారా మలయాళ నటిని కిడ్నాప్ చేయించాడంటూ విచారణ ఎదుర్కొంటున్న దిలీప్.. త్వరలో ట్రయల్స్ కు హాజరు కావాల్సి ఉంది. నాలుగు సార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కాగా.. రీసెంట్ గానే బెయిల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చాడు దిలీప్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు