వాచ్ ఔట్: ఎలక్షన్ల బరిలో నటీనటులు

వాచ్ ఔట్: ఎలక్షన్ల బరిలో నటీనటులు

ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం రాజ‌కీయం రంగ ప్ర‌వేశం చేసిన సినీ ధ్రువతార ఎన్టీ రామారావు. సినీ రంగంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతుల‌తో రాజ‌కీయాలను షేక్ చేసిన వ్య‌క్తి ఆయ‌న‌. ఆయ‌నే స్పూర్తిగా ఎంతో మంది సినీ రంగానికి చెందిన వ్య‌క్తులు రాజ‌కీయాల్లో అడుగు పెట్టారు. ఇప్ప‌టికీ ఈ తతంగం సాగుతూనే ఉంది. మెగాస్టార్ చిరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియదు కాని.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ మాత్రం జనసేనానికి ఎలక్షన్ల బరిలోకి దిగుతున్నాడని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మ‌రో త‌రం... రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసేందుకు సిద్ధ‌ప‌డుతోంది. ఇందుకు వ‌చ్చే ఎన్నిక‌లే వేదిక కాబోతున్నాయి.

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్నారు. అందుకే త‌న రాజ‌కీయ వార‌స‌త్వాన్ని మంచు ల‌క్ష్మికి ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఆమె వైసీపీ త‌ర‌పు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. చిత్తూరులోని చంద్ర‌గిరి లేదా శ్రీ కాళ‌హ‌స్తి నియోజ‌క వ‌ర్గం టిక్కెట్‌ను మంచు ఆశిస్తున్నారు. అయితే అక్క‌డ‌ ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీ త‌ర‌పున చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చాలా క్లోజ్‌.  మోహ‌న్ బాబు కుటుంబం కూడా జ‌గ‌న్ కుటుంబంతో స‌త్సంబంధాలు ఉన్నాయి. మంచు విష్ణు వెరోనికా కూడా వైఎస్ కుటుంబానికి చెందిన వ్య‌క్తే. ఆ విధంగా చూస్తే లక్ష్మి ఎంట్రీ పక్కా అనే అనుకోవాలి.

స‌మంత‌... అక్కినేని వారి పెద్ద కోడ‌లు. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్. ఆ ప‌ద‌వి ఆమెకెందుకు  ఇచ్చారు అని మొద‌ట్లో త‌ల‌లు ప‌ట్టుకున్న‌వారు ఉన్నారు. తెలుగింటి ఆడ‌పడ‌చులు ఎందరో ఉండ‌గా... సామ్ నే ఎందుకు పెట్టుకున్నారు? స‌మంత‌కు యువ‌త‌లో ఉన్న ఫాలోయింగ్ ఎక్కువే. అంతే కాదు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెను రంగంలోకి దించే ఆలోచ‌న‌లో ఉంద‌ట తెరాస‌. అందుకేనేమో ముందే ఆమెను మ‌రో పార్టీలో చేర‌కుండా క‌ట్టిప‌డేశారు. కేటీఆర్ ఫ్యామిలీతో నాగ్ కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే మొన్న ఇవాంకా ట్రిప్లో కూడా స‌మంత ప్ర‌ధాన‌పాత్రే పోషించింది. అంతేకాదు సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో క్రిస్టియ‌న్ కూడా ఓట‌ర్లు కూడా ఎక్కువే. స‌మంత అయితే ఆ ఓట్ల‌న్నీ సామ్ ప‌డే అవ‌కాశం ఉంద‌న్న‌ది వారి ప్లాన్‌. అక్కినేని వర్గాలు ఎంత ఖండించినా కూడా.. ఈ రూమర్ మాత్రం నిజమే అంటున్నారు పొలిటికల్ శ్రేణులు.

ఇక మరో నటుడు రాజ‌శేఖ‌ర్ భార్య జీవిత కూడా బీజేపీలో చేరారు. ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేయాల‌ని ఆశిస్తున్నారు. కాని తెలుగుదేశంలో చేరతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఎక్కడ చేరినా కూడా పోటీ మాత్రం పక్కా అంటున్నారు. 2014లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు హేమ మండ‌పాడ నియోజ‌క వ‌ర్గంలో స‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌పున పోటీ చేసింది. ఇప్పుడామె వైసీపీలో చేరాల‌నుకుంటోంది.

ఇక న‌టుడు అలీ 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. తెలుగు దేశం పార్టీ త‌ర‌పు రాజ‌మండ్రిలో నిల‌బ‌డాల‌ని అనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. మ‌రి ఇప్పుడు ఏ పార్టీ అత‌డిని ఆహ్వానిస్తుందో చూడాలి. అలీ న‌టుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాడు. ఇప్పుడు పీకే జ‌న‌సే పార్టీ పెట్టాడు క‌నుక‌... ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English