అతడితో మళ్లీ సై అన్న చలో బ్యూటీ

అతడితో మళ్లీ సై అన్న చలో బ్యూటీ

టాలీవుడ్ లో అందాల భామల దాడి పెరిగిపోతోంది. కొత్త కొత్త భామలు రావడమే కాదు.. ఇలా వచ్చీ రాగానే ట్యాలెంట్ చూపించేసి సెటిల్ అయిపోతున్నారు. ఇప్పుడీ జాబితాలో శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన కూడా చేరిపోయింది. రీసెంట్ గా నాగశౌర్యతో కలిసి ఛలో అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టేసి టాలీవుడ్ లో పాగా వేసేసింది.

ఇప్పటికే మరో తెలుగు సినిమాను ఈమె దాదాపు పూర్తి చేసేస్తోంది. ఇప్పుడు మరోసినిమాకు కూడా సై అనేసిందని తెలుస్తోంది. ఈ రెండింటికీ నిర్మాణ సంస్థలు వేరయినా.. హీరో ఒకరే కావడమే అసలు సిసలైన హైలైట్. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ.. రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ కూడా ఏర్పడగా.. ఇప్పుడు వీరిద్దరూ మరో మూవీకి కూడా అంగీకరించేశారట.

ఇప్పటివరకూ భారీ బడ్జెట్ చిత్రాలతో అలరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఓ మీడియం బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతుండగా.. ఇప్పుడీ చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ- రష్మిక మందన లను హీరో హీరోయిన్లుగా ఫైనల్ చేశారట. రొమాన్స్ తో పాటు యాక్షన్ కం ఎంటర్టెయినర్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. ఈ సినిమాలో కాకినాడ కుర్రాడిగా విజయ్ దేవరకొండ నటించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు