మహేష్ లేటుతో డైరెక్టర్ కి మంచే!!

మహేష్ లేటుతో డైరెక్టర్ కి మంచే!!

సినిమాలను వీలైనంత స్పీడ్ గా చేయాలని భావిస్తాడు మహేష్ బాబు. అందుకే ఓ సినిమా చేస్తున్నపుడే మరో సినిమాను అంగీకరించేస్తాడు. ఇంకో ప్రాజెక్టును లైన్ లో పెట్టేస్తాడు. ఇంకొన్ని చర్చల దశలో ఉంటాయి. అలాగే.. వంశీ పైడిపల్లి దాదాపు ఏడాదిన్నరకు పైగా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది.

మహేష్ బాబు హీరోగా రూపొందే 25వ సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి అనే సంగతి తెలిసిందే. మహేష్ త్వరగా సినిమాలు తీసేద్దామని భావించినా.. ఆయా దర్శకులు చేసే ఆలస్యం కారణంగా ప్రాజెక్టులు డిలే అవుతున్నాయి. ఈ ప్రభావంతో వంశీ పైడిపల్లికి వెయిట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. స్క్రిప్ట్ కూడా పూర్తి చేసేసుకుని రెడీగా ఉన్నాక.. మరి ఏడాదిన్నర పాటు ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడనే డౌట్ రావడం అయితే సహజమే. చాలాకాలంగా తన కోసం వెచ్చించుకునేందుకు టైం దొరకలేదట వంశీ పైడిపల్లికి. అందుకే ఇప్పుడు దొరికిన సమయాన్ని తన ఫిజికల్ ఫిట్నెస్ కోసం కేటాయించాడట. ఆ ఫలితం ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది.

కాసింత భారీ విగ్రహం మాదిరిగా కనిపించే వంశీ పైడిపల్లి ఇప్పుడు చక్కగా ఫిట్ గా తయారైపోయాడు. ఇదంతా మహేష్ బాబు సినిమా ఆలస్యం కావడంగానే జరిగింది. లేకపోతే మామూలుగానే ఉండేవాడు కదా. ఇక మహేష్- వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు