‘అఆ’కు చేసినోడే ఎన్టీఆర్‌కూ..

‘అఆ’కు చేసినోడే ఎన్టీఆర్‌కూ..

తన సినిమాకు పని చేసే టెక్నీషియన్ల విషయంలో మంచి అభిరుచి చూపిస్తుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో పర్టికులర్‌గా ఉంటాడతను. అతడి ప్రతి సినిమాలోనూ కెమెరా పనితనం కనిపిస్తుంటుంది. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయినా సరే.. అందులో ఛాయాగ్రహణం మాత్రం ఆకట్టుకుంటుంది.

అంతకుముందు వచ్చిన త్రివిక్రమ్ సినిమా ‘అఆ’ సినిమాలో సినిమాటోగ్రఫీ మరింతగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తమిళ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణ్యన్ ఛాయాగ్రహణం అందించాడు. తమిళంలో హీరోగా కూడా రాణించిన నటరాజ్‌కు సినిమాటోగ్రాఫర్‌గా గొప్ప పేరే ఉంది. బాలీవుడ్లో సైతం అతను చాలా సినిమాలు చేశాడు.

ఎన్టీఆర్‌తో చేయబోయే తన తర్వాతి సినిమాకు కూడా నటరాజ్‌నే కెమెరామన్‌గా పెట్టుకోబోతున్నాడట త్రివిక్రమ్. సంగీత దర్శకుడిగా ముందు అనిరుధ్ రవిచందర్‌ను అనుకున్నప్పటికీ తర్వాత ఆలోచన మారింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీం అందించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్.. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు ఇంకో పది రోజుల్లో ప్రకటిస్తారట.

మార్చి నెలాఖర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట. త్రివిక్రమ్‌తో వరుసగా సినిమాలు చేస్తున్న రాధాకృష్ణే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సరికొత్త లుక్‌లోకి మారబోతున్నాడు. సినిమా ప్రారంభమయ్యే సమయంలోనే ఈ లుక్‌ను కూడా రివీల్ చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు