కథ కోసమే కోట్లిచ్చిన హీరో??

కథ కోసమే కోట్లిచ్చిన హీరో??

ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా సరే సినిమాకు కథ చాలా కీలకం. ఎలాంటి హీరోకు అయినా కథ అంతో ఇంతో ఆకట్టుకుంటేనే సినిమాను జనాలు మెచ్చుతారు. అందుకే స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లు.. అనే పదాలతో పాటు స్టార్ రైటర్లు అనే మాట తరచుగా వినిపిస్తోంది.

బాహుబలి సిరీస్ తో పాటు భజరంగీ భాయిజాన్ మూవీతో బంపర్ హిట్స్ కొట్టిన రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడీయన రైటింగ్ అంటేనే చాలు.. సినిమాకు సగం క్రేజ్ వచ్చేస్తోంది. బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలకు కథలు ఇస్తున్నాడనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడీయన మంచు ఫ్యామిలీ హీరో విష్ణుకు ఓ కథ ఇచ్చాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన కూడా కన్ఫాం చేశాడు. తాను మంచు విష్ణుకు ఓ కథ రూపొందించి ఇచ్చిన మాట వాస్తవమే అని అంగీకరించాడు. అయితే.. ఈ కథ కోసం ఏకంగా ఈయన 2 కోట్ల రూపాయలు పుచ్చుకున్నాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

కానీ దీనిపై రియాక్ట్ అయేందుకు కానీ.. ఈ కథ ఏ జోనర్ లో ఉంటుందనే పాయింట్ కానీ విజయేంద్ర ప్రసాద్ చెప్పడం లేదు. పైగా మంచు విష్ణునే అడగాలని సూచిస్తున్నాడు. మోహన్ బాబు కూడా విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ విపరీతంగా నచ్చేసిందని చెబుతున్నారు. ఈ స్టోరీకి 2 కోట్ల మొత్తం అంటే కరెక్టే అని ఫీలయ్యారట మోహన్ బాబు. మొత్తానికి టాలీవుడ్ లో ఓ కథ కోసం ఇంత మొత్తం చెల్లించడం ఓ రికార్డ్ అవుతుందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English