అంతలోనే ఎంత మారావ్ మిల్కీ

అంతలోనే ఎంత మారావ్ మిల్కీ

గ్లామర్ ప్రపంచంలో ఉన్న అందాల సుందరాంగులపై అందరూ ఓ కన్నేసి ఉంచుతారు. బాడీ మెజర్మెంట్స్ లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇట్టే పసిగట్టేసే జనాలు చాలామందే ఉంటారు. తమ అభిమాన బ్యూటీ గురించి ఫ్యాన్స్ ఆందోళన పడిపోతే.. మరికొందరు మాత్రం దొరికిందే తడవు అన్నట్లుగా తెగ విమర్శలు చేసేస్తూ ఉంటారు.

చాలాకాలంగా తన ఫిజిక్ ను ఒకే స్థితిలో కాపాడుకుంటూ వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదు. ఓ రెండు నెలల క్రితం తమన్నా కాసింత బొద్దుగా కనిపించింది. ఇలా ఎందుకు మారిందో అన్న విషయంపై అప్పుడే కాదు.. ఇప్పటికీ ఎవరి దగ్గరా క్లారిటీ లేదు. ఆమె కూడా చెప్పలేదు. కానీ జనాలు మాత్రం తమ్మూ లావెక్కేసింది అంటూ తెగ హంగామా చేసేసారు. బుగ్గలు కూడా బూరెల మాదిరిగా కాసింత ఉబ్బి కనిపించాయి. లావుగా మారిపోయి తర్వాత సన్నబడలేక ఇబ్బందులు పడుతున్న వారితో పోల్చడం మొదలుపెట్టేశారు జనాలు. ఈ విమర్శలు అన్నీ తమన్నా చెవిన పడ్డట్టున్నాయ్. అందుకే వెంటనే తగిన యాక్టివిటీస్ చేపట్టేసింది.

రీసెంట్ గా ఈ భామ తన సోషల్ మీడియా పేజ్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తన స్నేహితురాలికి బర్త్ డే విషెస్ చెబుతూ పెట్టిన ఈ పోస్ట్ లో.. తమన్నా తళుకులు చూస్తే తెగ ముచ్చట పడిపోవాల్సిందే. అంతగా సన్నబడిపోయి కనిపిస్తోంది మిల్కీ బ్యూటీ. ఇందుకోసం స్పెషల్ డైట్ తీసుకుంటోందట మిల్కీ. రోజూ కేవలం పసర్ల జూస్ తప్పించి ఏమీ తినట్లేదట. ఫుడ్ విషయంలో ఫుల్ కంట్రోల్ పాటించేసి తన ఫిజిక్ ను మళ్లీ సాధించేసిందట తమన్నా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు