నిఖిల్ పాలిటిక్స్ సినిమా కోసమేనా?

నిఖిల్ పాలిటిక్స్ సినిమా కోసమేనా?

సినిమా రంగం - రాజకీయాలు రెండింటికీ బోలెడంత  రిలేషన్ ఉన్నా.. టాలీవుడ్ తారలు పాలిటిక్స్ పై మాట్లాడేందుకు ఉత్సాహం చూపరు. ఇందుకు కారణం.. ఆయా వర్గాలకు చెందిన ప్రేక్షకులు తమ సినిమాలకు దూరం అవుతారనే భయమే అనుకోవచ్చు. ఇప్పుడు అనూహ్యంగా కుర్ర హీరో నిఖిల్ పేరు రాజకీయాల్లో వినిపిస్తోంది.

ఈ కుర్రాడికేమీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు కానీ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తూ చేసిన కామెంట్స్.. పెట్టిన ట్వీట్స్ కారణంగా జనాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. సినిమాలు చేసుకోవచ్చుగా ఇవన్నీ నీకెందుకు అని చాలామంది చెబుతున్నట్లు చెబుతున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఈ కుర్ర హీరో నటించిన కిర్రాక్ పార్టీ.. రిలీజ్ కి సిద్ధమైంది. ఇందులో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా నిఖిల్ కనిపించబోతున్నాడు. స్టూడెంట్ పాలిటిక్స్ కి సంబంధించిన కంటెంట్ సినిమాల్లో ఉంటుంది. ఈ సినిమా ప్రచారం కోసమే.. ఇలా పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాడనే కామెంట్స్  వినిపిస్తున్నాయి. వీటిని నిఖిల్ నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాడు.

కిర్రాక్ పార్టీతో పాటు పలు సినిమాల కోసం విజయవాడ.. రాజమండ్రి వంటి ప్రాంతాలలో షూటింగ్ చేసినపుడు.. అక్కడ పరిస్థితులను కళ్లారా చూశాడట ఈ తెలంగాణ కుర్రాడు. అక్కడ అభివృద్ధి జరగాలంటే.. కేంద్రం సాయం అవసరం అనే విషయం అర్ధమైందట. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ అర్బన్ ప్రాంతాలు మరో 30 ఏళ్ల పాటు వెనకబడే ఉంటాయని అనిపించడంతోనే.. తన ఫీలింగ్ వెల్లడించానంటున్నాడు నిఖిల్. ఇతని ఫీలింగ్ కూడా అర్దం చేసుకోదగ్గదే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు