కుర్రాళ్ల ధాటికి సీనియర్ తట్టుకోగలడా?

కుర్రాళ్ల ధాటికి సీనియర్ తట్టుకోగలడా?

టాలీవుడ్లో బాక్సాఫీస్‌లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు ఒకే వీకెండ్లో వార్‌కు సిద్ధమవడం ఆసక్తి రేకెత్తిస్తుండగా.. ఈ ఇద్దరు యువ కథానాయకులతో ఒక లెజెండరీ సీనియర్ నటుడు పోటీ పడుతుండటం ఆసక్తిని మరింత పెంచేదే.

మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలున్నప్పటికీ ఇప్పటిదాకా బాక్సాఫీస్ దగ్గర ఒకరితో ఒకరు పోటీ పడింది లేదు. కానీ తొలిసారిగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పోటీకి సిద్ధమయ్యారు. సాయిధరమ్ తేజ్ మూవీ ‘ఇంటిలిజెంట్’ శుక్రవారం రిలీజవుతుండగా.. శనివారం ‘తొలి ప్రేమ’ వస్తోంది. మరి వీటిలో దేనిపై ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

ఇక మోహన్ బాబు సినిమా ‘గాయత్రి’ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరం. మోహన్ బాబు హీరోగా సినిమాలు చేయడమే తగ్గిపోయింది. ఈ తరం ప్రేక్షకులకు ఆయన పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు చేసిన సినిమాలే తక్కువ.

అవి కూడా పెద్దగా ఆడింది లేదు. దీంతో ఇప్పటి ప్రేక్షకులు ఆయన నటించిన ‘గాయత్రి’పై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారో చూడాలి. పైగా ఆయన ఇద్దరు యంగ్ హీరోల సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇందులో ‘తొలి ప్రేమ’పై మంచి అంచనాలున్నాయి. ఈ వారం యువ ప్రేక్షకులు ఫస్ట్ ఛాయిస్ ఇదే. మాస్ ఆడియన్స్ ఛాయిస్ ‘ఇంటిలిజెంట్’ అవుతుంది. ‘గాయత్రి’ లాస్ట్ ప్రయారిటీనే అవుతుంది.

ఐతే ‘గాయత్రి’కి కథాబలం ఉందని.. మోహన్ బాబు నటన కూడా పెద్ద బలం అని అంటున్నారు. మరి ఆయన ప్రేక్షకుల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తారో.. యంగ్ హీరోలతో పోటీ పడి బాక్సాఫీస్‌ను ఎలా గెలుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు