నాని, పల్లవి ఇద్దరూ పెంచేసారు

నాని, పల్లవి ఇద్దరూ పెంచేసారు

మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌ సక్సెస్‌ దిల్‌ రాజుకి ఎంత ఆనందాన్నిచ్చిందో తెలియదు కానీ, ఈ సినిమా విజయంతో అందులో జంటగా నటించిన నాని, సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ పారితోషికాలు పెంచేసారు. అంతంతమాత్రంగా వున్న ఆ సినిమా అంత అలా ఆడడానికి హీరో హీరోయిన్లకి వున్న గుడ్‌విల్‌, క్రేజ్‌ కారణమని అందరూ ఒప్పుకుని తీరాలి.

నాని మార్కెట్‌ నిన్నమొన్నటి వరకు పదిహేను కోట్ల రేంజిలో వుండేది. కానీ ఇప్పుడతని సినిమాలు నిలకడగా ముప్పయ్‌ కోట్ల షేర్‌ వసూలు చేస్తున్నాయి. దీంతో తన పారితోషికం పెంచే సమయం వచ్చిందని నాని భావించాడు. నాలుగైదు కోట్ల స్థాయి నుంచి ఒకేసారి తొమ్మిది కోట్లు అడుగుతున్నాడట. నాని సినిమాలకి అన్ని హక్కులతో కలిపి నలభై కోట్ల వరకు వసూలవుతున్నాయి. అతని సినిమాకి అయ్యే ఖర్చు కూడా ఇరవై కోట్ల లోపే వుంటుంది. కనుక నాని షేర్‌గా తొమ్మిది కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చు.

మరోవైపు ఫిదా, ఎంసిఏ విజయాలతో యూత్‌ హార్ట్‌ త్రోబ్‌ అయిపోయిన సాయి పల్లవి తన పారితోషికాన్ని కోటి దాటించేసింది. శర్వానంద్‌ సినిమాలో నటించడానికి కోటీ పాతిక లక్షల పారితోషికంతో పాటు మరో పాతిక లక్షలు ఇతర ఖర్చులకి అడుగుతోందట. ప్రస్తుతం ఆమెకి వున్న క్రేజ్‌ దృష్టిలో వుంచుకుని తను అడిగినంత ఇవ్వక తప్పదన్నమాట. ఈ సినిమాతో హిట్టిచ్చిన దర్శకుడి పేరు కూడా చాలా మందికి తెలీదు. అంతగా ఈ విజయాన్ని ఈ ఇద్దరూ హైజాక్‌ చేసి ఫుల్‌గా క్యాష్‌ కూడా చేసుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English