పాపం రకుల్... ఉన్నదీ పోయిందీ...

పాపం రకుల్... ఉన్నదీ పోయిందీ...

రకుల్ పరిస్థితి ప్రస్తుతం ఏం బాగోలేదు. తమిళంలో, హిందీలో అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటున్నా... ఆమెను ఒకప్పుడు ఆకాశానికెత్తేసిన తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేతిలో లేదు.

అప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరి వచ్చేసింది. ఇప్పటికీ తెలుగులో ఒక్క సినిమాకు సైన్ చేయలేదు రకుల్. స్పైడర్ ఇచ్చిన దెబ్బకి ఇంకా కోలుకున్నట్టు కనిపించడం లేదు ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు... తనకి అన్నీ గ్లామరస్ పాత్రలే వస్తున్నాయని... అనుష్కలా లేడీ ఓరియంటెడ్ పాత్రలు రావడం లేదని అలిగినట్టుంది అమ్మడు. అందుకేనట వస్తున్న అరకొర సినిమాలను కూడా చేయనని, గ్లామర్ పాత్రల మీద ఆసక్తి లేదని చెప్పేస్తోందట. దీంతో ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా లేకుండా అయిపోయింది రకుల్. ఇప్పుడు పాప పరిస్థితి ఎలా తయారైందంటే... ఉన్నదీ పోయింది... ఉంచుకున్నది పోయింది అన్న చందాన ఉంది.

ఏదో ఒక సినిమాలో తెలుగులో కనిపిస్తే కదా... అమ్మడు ఉందన్న సంగతి ప్రేక్షకులు మర్చిపోకుండా ఉంటారు. కానీ రకుల్ ఏ సినిమాను ఒప్పుకోలేదాయే. చూడాలి అసలు ఈ ఏడాది టాలీవుడ్లో బోణీ కొడుతుందో లేదో.  ఇక బాలీవుడ్లో ఈ వారం చివర్లో ఆమె నటించిన అయ్యారి సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఆ ప్రమోషన్లలో బిజీగా ఉంది రకుల్. కాని విషయం ఏంటంటే.. ఆ సినిమా రిలీజ్ ఆపాలంటూ కొందరు మిలటరీ మేజర్లు ఆపుతున్నారు. ఇప్పుడు అదో సెటిల్మెంట్ ఉంది. అది పూర్తయితేనే 9న అయ్యారి వస్తుందట. మొత్తానికి రకుల్ కు కాలం కలసి రావట్లేదు!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు