సమంత ఇలా.. అనుష్క అలా..

సమంత ఇలా.. అనుష్క అలా..

పెళ్లి తర్వాత హీరోయిన్ గా కొనసాగడం.. సౌత్ వరకు చూసుకుంటే ఇదో మహా కష్టమైన విషయం. ఉత్తరాదిలో అయితే.. చిన్న బ్రేక్ మినహాయించి తమ కెరీర్స్ ను యథాతథంగా కంటిన్యూ చేసేస్తుంటారు. కానీ సౌత్ లో ఇలాంటి వాతావరణం కనిపించదు. అటు మేకర్స్ ఛాన్సులు ఇవ్వరు.. ఇటు హీరోయిన్స్ లో కూడా మార్పు బాగానే వచ్చేస్తుంటుంది.

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా కంటిన్యూ అవుతానంటూ.. సమంత ముందే చెప్పిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే సినిమాలు చేసేందుకు ఆమె రెడీగానే ఉన్నా కొత్త ఆఫర్స్ ఇవ్వడానికి తెలుగు మూవీ మేకర్స్ ముందుకు రావడం లేదు. ఇక్కడ ఓ విషయం గమనించాలి. పెళ్ళయిన తరువాత సమంత ఏ మాత్రం ఎక్స్ పోజింగ్ చేయలేదు. అంతకు ముందు ఎంత గ్లామర్ గా కనిపించినా.. పెళ్లి  తర్వాత నుంచి చాలానే జాగ్రత్తపడింది. రాజు గారి గది ప్రెస్ మీట్ సమయాల్లో కూడా ఎక్కడా అందాల ప్రదర్శనే అన్నదే లేదు. ఇక్కడే మనకీ బాలీవుడ్ కి తేడా తెలిసిపోతుంది. సమంత తర్వాత మూడు నెలలకు పెళ్లి చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.

కాని ఇప్పుడు పరి సినిమా ప్రమోషన్ల కోసం ఎప్పటిలాగానే హాటుగా కనిపిస్తోంది. సినిమా రంగానికి కాకుండా మరో సెగ్మెంట్ కు చెందిన స్టార్ ను పెళ్లి చేసుకున్న అనుష్క.. గ్లామర్ విషయంలో పిసరంత కూడా కాంప్రమైజ్ కావడం లేదు. సమంత ఇలా ఎప్పుడైనా కనిపించగలదా అంటే.. డౌటే అనాల్సిందే. అందుకే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు సినిమాలు ఇవ్వరు మన మేకర్స్.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు