భక్త కన్నప్ప.. 70 కోట్లు.. హాలీవుడ్ డైరెక్టర్

భక్త కన్నప్ప.. 70 కోట్లు.. హాలీవుడ్ డైరెక్టర్

భక్త కన్నప్ప.. కృష్ణం రాజు కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం. దీన్ని రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నం జరుగుతోంది. ప్రభాస్ హీరోగా స్వయంగా కృష్ణంరాజే దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించాలని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇంతలో తనికెళ్ల భరణి ‘కన్నప్ప’ స్క్రిప్టు రెడీ చేశాడు. మంచు విష్ణు ఆ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.

దీని మీద కొంత వివాదం చెలరేగినప్పటికీ.. తర్వాత అది సద్దుమణిగింది. విష్ణు సినిమా చేయడానికి మార్గం సుగమమైంది. ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నాడు మంచు విష్ణు. ఈ ప్రాజెక్టు గురించి విష్ణు చెబుతున్న విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

‘కన్నప్ప’ సినిమాను రూ.70-80 కోట్ల మధ్య బడ్జెట్లో తెరకెక్కించనున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. అంత బడ్జెట్ అంటే చాలా పెద్ద రిస్కే అని.. అయితే మొండి ధైర్యంతో రంగంలోకి దిగబోతున్నామని విష్ణు చెప్పాడు. ప్రస్తుతం తన మార్కెట్ అంత లేదని.. ఐతే ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు రిలీజయ్యాక తన మార్కెట్ కచ్చితంగా పెరుగుతుందని అతనన్నాడు. తనికెళ్ల భరణితో కలిసి తాను ఈ స్క్రిప్టును డెవలప్ చేశానని.. ఒక హాలీవుడ్ రైటర్ కూడా తమకు రచనా సహకారం అందించాడని విష్ణు తెలిపాడు.

రచయిత సాయిమాధవ్ బుర్రా కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని.. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాక భరణి చుూసి ఓకే చేయాల్సి ఉందని విష్ణు చెప్పాడు. ఈ చిత్రాన్ని ఒక హాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని.. ఆ దర్శకుడెవరన్నది త్వరలో ప్రకటిస్తామని విష్ణు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English