రవితేజకి మెగా షాక్‌

రవితేజకి మెగా షాక్‌

రెమ్యూనరేషన్‌ విషయంలో పట్టు విడుపులు చూపించకుండా 'రాజా ది గ్రేట్‌' సక్సెస్‌ కాగానే మళ్లీ చెట్టెక్కి కూర్చున్న రవితేజకి వెంటనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. 'టచ్‌ చేసి చూడు' చిత్రం ఫ్లాప్‌ అవడం సంగతి అటుంచి కనీసం ఓపెనింగ్స్‌ కూడా సరిగా రాబట్టుకోలేకపోయింది. ఫస్ట్‌ వీకెండ్‌లోనే దారుణంగా డ్రాప్‌ అయిన ఈ చిత్రం రవితేజపై ఇంతకుముందు నెలకొన్న అనుమానాలని మళ్లీ తెరపైకి తెచ్చింది.

రవితేజ చిత్రాలకి డిమాండ్‌ వుండడం లేదని, కనుక అతని చిత్రాలపై పెట్టే ఖర్చుని అదుపులో వుంచాలని ఆమధ్య నిర్మాతలు డిసైడయ్యారు. చాలా కాలం పాటు సినిమాలే చేయని రవితేజ చివరకు కాంప్రమైజ్‌ అయి దిల్‌ రాజు సంస్థలో 'రాజా ది గ్రేట్‌' చిత్రాన్ని చాలా తక్కువ పారితోషికానికి చేసాడు. అది ఒక మాదిరిగా ఆడేసరికి మళ్లీ రవితేజ రేటు పెంచేసాడు. కానీ తన సినిమా ఫ్లాప్‌ అయితే నాగశౌర్య సినిమా కంటే తక్కువ వసూళ్లు వచ్చే ప్రమాదం వుందని టచ్‌ చేసి చూడు తేల్చేసింది.

దీంతో రవితేజ పారితోషికం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడైనా చెట్టు దిగుతాడో లేక మళ్లీ ఎప్పటిలా తనకి ఇంత కావాలంటూ డిమాండ్‌ చేస్తాడో చూడాలి. ఏదేమైనా రవితేజ స్టోరీ సెలక్షన్‌పై, ట్రెండ్‌కి తగ్గట్టు లేని తన ఆలోచనా ధోరణిపై టచ్‌ చేసి చూడు చాలా అనుమానాలే రేకెత్తించి మాస్‌ మహారాజుని ఇరుకున పడేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు