ఎన్టీఆర్‌ సినిమాకీ బాలకృష్ణ సెంటిమెంటు

ఎన్టీఆర్‌ సినిమాకీ బాలకృష్ణ సెంటిమెంటు

సంక్రాంతి పండక్కి అత్యధిక విజయాలున్న బాలకృష్ణకి ఈసారి సంక్రాంతి కూడా కలిసి వచ్చింది. జైసింహా విజయవంతం కావడంతో బాలయ్యకి ఈ ఏడాది బోణీ బాగా జరిగింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా మొదలు పెట్టి విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళదామని భావించారు.

అయితే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్నట్టు కాకుండా కాస్త ఆలస్యంగా మొదలు పెట్టనున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోను వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కావాలని బాలకృష్ణ అల్టిమేటం జారీ చేసారట. సంక్రాంతికి విడుదల చేస్తే ఎన్టీఆర్‌ వర్ధంతి అయిన జనవరి 18కి థియేటర్లలో సినిమా వుంటుందనేది కూడా ఈ ప్లాన్‌కి ఒక కారణమట.

ఈ చిత్రం చేసే వరకు బాలయ్య మరో చిత్రం ఏదీ చేయకూడదని డిసైడయ్యారు. మరోవైపు ఈ చిత్రం మొదలు కావడానికి సమయం వుండడంతో దర్శకుడు తేజ ప్రస్తుతం వెంకటేష్‌ సినిమాతో బిజీ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English