తమిళ సినిమాలో తెలుగు హంగామా

తమిళ సినిమాలో తెలుగు హంగామా

ఈ వారాంతంలో విడుదలైన ఒక తమిళ సినిమాపై తెలుగు జనాలు కూడా ఆసక్తి ప్రదర్శించారు. అందుక్కారణం ఆ సినిమాలో మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక ఓ కీలక పాత్ర పోషించడమే. ఆ చిత్రం పేరు ‘ఒరు నల్ల నాలు పాత్తు సొల్రేన్’. తమిళంలో గొప్ప నటుడిగా పేరు సంపాదించిన విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నిహారికతో పాటు గౌతమ్ కార్తీక్.. గాయత్రి కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రంలో నిహారిక తెలుగమ్మాయిగా కనిపించడం విశేషం. ఆమె సినిమాలో తెలుగులోనే మాట్లాడటమూ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక నిహారికను ఇంప్రెస్ చేయడానికి విజయ్ సేతుపతి సైతం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఇందులో యమలోకం నేపథ్యంలో కూడా సీన్లు ఉంటాయి. ఆ సందర్భంగా యముడి క్యారెక్టర్లో కనిపించే విజయ్ సేతుపతి తమకు ‘యమదొంగ’ సినిమా అంటే ఇష్టమని అంటాడు. ఇంకా బాలయ్య తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ రెఫరెన్స్ ఈ చిత్రంలో ఉంటుంది.

దీంతో పాటు ఒక చోట విజయ్ సేతుపతి చిరంజీవి సినిమా ‘ఘరానా మొగుడు’లోని బంగారు కోడిపెట్ట పాటకు నృత్యం చేయడం విశేషం. మరోచోట పవన్ సినిమా ‘కాటమరాయుడు’ పోస్టర్ కనిపిస్తుంది. ఇలా తెలుగు సినిమాల రెఫరెన్సులు ఇందులో చాలానే ఉన్నాయి. ఐతే ఈ చిత్రానికి తమిళంలో ఏమంత గొప్ప టాక్ అయితే రాలేదు. నిహారిక నటన పర్వాలేదని అంటున్నప్పటికీ.. ఆమె ఆశించే విజయం ఈ సినిమాతో అయినా దక్కుతుందా అన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English