కమల్‌లా కష్టపడ్డ మోహన్ బాబు

కమల్‌లా కష్టపడ్డ మోహన్ బాబు

ప్రోస్థెటిక్ మేకప్.. ఈ మాట ఇండియాలో మొదటగా వినిపించింది కమల్ హాసన్ ‘దశావతారం’ సినిమాకే. మనిషి అవతారాన్నే పూర్తిగా మార్చేసి ఒక కొత్త వ్యక్తిలా చూపించడానికి ఉపయోగించే మేకప్ స్టైల్ ఇది. ‘దశావతారం’ సినిమాలో ఏకంగా పది రకాల గెటప్పుల్లో కనిపించిన కమల్ హాసన్.. వాటి మేకప్ కోసం ఎంత కష్టపడ్డాడో మేకింగ్ వీడియోల్లో కనిపించింది. ఆయన ముఖం మొత్తం కప్పేసి మేకప్ వేసిన తీరుకు అందరూ షాకయ్యారు.

ఆ తర్వాత ‘రోబో’లో రజినీకాంత్ సహా చాలామంది నటీనటులు ఈ టైపు మేకప్ ట్రై చేశారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు సైతం ఇదే స్టయిల్ ఫాలో అయ్యారు. ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు రెండు పాత్రల్లో కనిపించారు. వాటిలో వేరియేషన్ కోసం ఆయన ప్రోస్థెటిక్ మేకప్ ట్రై చేశారు. ఇందుకోసం ఆయన ఎంత కష్టపడిందీ చూపిస్తూ ఒక మేకింగ్ వీడియో వదిలింది ‘గాయత్రి’ టీం. అప్పట్లో కమల్‌కు ఎలా మేకప్ వేశారో ఇప్పుడు మోహన్ బాబుకు కూడా అలాగే ట్రై చేశారు.

కొన్ని గంటల పాటు కదలకుండా కూర్చోబెట్టి.. ముఖాన్నంతా రకరకాల మేకప్ మెటీరియల్‌తో కప్పేసి.. కొంత విరామం తర్వాత అదంతా తీసేసి.. ఆయనకు మేకప్ వేసింది ప్రోస్థెటిక్ మేకప్ టీం. ఈ వయసులో మోహన్ బాబు ఒక సినిమా కోసం ఇంత కష్టపడటం చూసి ఆశ్చర్యపోతూ ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు జనం. మదన్ దర్శకత్వంలో రూపొందిని ‘గాయత్రి’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు