మాస్ రాజా.. ఇంత దారుణమా?

మాస్ రాజా.. ఇంత దారుణమా?

‘భాగమతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా అమెరికాలో మిలియన్ డాలర్ల మార్కును అందుకుని సంచలనం సృష్టించింది. ఇక ఈ వారాంతంలో విడుదలైన ‘ఛలో’ హాఫ్ మిలియన్ మార్కును అందుకుంటోంది. ఈ చిత్ర కథానాయకుడు నాగశౌర్య రేంజ్, మార్కెట్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాగే మాస్ రాజా రవితేజ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

కానీ మాస్ రాజా కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’కు అమెరికాలో వస్తున్న వసూళ్లు చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. ఆదివారం నాడు ‘ఛలో’ సినిమాకు 80 వేల డాలర్ల దాకా వసూళ్లు వచ్చాయి. ముందు వారం రిలీజైన ‘భాగమతి’ సైతం 26 వేల డాలర్లు వసూలు చేసింది. కానీ ‘టచ్ చేసి చూడు’ కలెక్షన్లు 19 వేల డాలర్లు మాత్రమే. మొత్తంగా ఈ చిత్రం వీకెండ్లో 2 లక్షల డాలర్ల మార్కును కూడా అందుకోలేదు. మాస్ మాస్ అంటుంటాడు కానీ.. ‘టచ్ చేసి చూడు’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఈ చిత్రం వీకెండ్లో రూ.10 కోట్ల షేర్ మార్కును కూడా అందుకోలేదు. టాక్ బ్యాడ్‌గా ఉండటంతో తొలి రోజే వసూళ్లు పడిపోయాయి. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు రూ.21 కోట్ల దాకా అమ్మగా.. అందులో సగం వసూలు కావడం కూడా కష్టంగానే ఉంది. మాస్ రాజా మార్కెట్ ఆల్రెడీ డౌన్ అయి ఉండగా.. ‘రాజా ది గ్రేట్’తో కొంచెం పుంజుకున్నట్లు కనిపించింది. కానీ ‘టచ్ చేసి చూడు’ మళ్లీ మాస్ రాజాను యథా స్థితికి తీసుకొచ్చింది. ఈ ప్రభావం అతడి తర్వాతి సినిమాలపై కచ్చితంగా పడుతుందనడంలో సందేహంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు